తెలంగాణ

telangana

Govt Doctors Report on Chandrababu Health Problems: చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యుల కీలక నివేదిక

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 4:22 PM IST

Updated : Oct 15, 2023, 6:14 AM IST

Govt Doctors Report on Chandrababu Health Problems: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కీలక నివేదిక బయటకు వచ్చింది. ఆ నివేదిక జైలు అధికారులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా ఉండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

Govt_ Doctors_Report_on_Chandrababu
Govt_ Doctors_Report_on_Chandrababu

Govt Doctors Report on Chandrababu Health Problems: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్యానికి సంబంధించి.. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు శనివారం కీలక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదికలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైలు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా వైద్యుల నివేదిక ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Govt Doctors Report Details: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హైడ్రామా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన నివేదికలో.. చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపుపై దద్దుర్లు, స్కిన్ అలెర్జీలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఈనెల 12న సాయంత్రం 4.30 గంటలకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు.. అదే రోజు సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు జి.సూర్యనారాయణ, వి.సునీత దేవిలతో కూడిన వైద్య బృందం చంద్రబాబు పరిక్షించింది. అనంతరం ఈ నివేదికను జైలు అధికారులకు అందజేసింది. ఆ తర్వాత చంద్రబాబు చల్లని వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చంద్రబాబుకు ఐదు రకాల మందులను వైద్య బృందం సిఫార్సు చేసింది.

DIG Ravi Kiran on Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నిన్న జైల్ శాఖ డీఐజీ ఎం.రవికిరణ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ''రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 2,039 మంది ఖైదీలు ఉన్నారు. అందులో చంద్రబాబు నాయుడు ఒకరు. ఆయనది హైప్రొఫైల్‌ ప్రిజనర్‌ కావడంతో ప్రత్యేకంగా స్నేహ బ్లాక్‌ను కేటాయించాం. ఆ బ్లాక్ వద్ద జిల్లా ఎస్పీ సహకారంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశాం. ఆయన జైలులో ఆరోగ్యంగానే ఉన్నారు.' అని అన్నారు. అంతేకాకుండా, జైలులో ఇతర ఖైదీలు చంద్రబాబు నాయుడి కనుచూపు మేరలో ఎవరూ ఉండరని, ఎవరైనా ములాఖత్‌కు వస్తే ఆయన అంగీకరించాకే కలిసే అవకాశం ఇస్తున్నామని.. డీఐజీ ఎం.రవికిరణ్‌ తెలిపారు. చంద్రబాబు జైలుకు వచ్చే సమయానికి 68 కిలోల బరువు ఉన్నారన్న డీఐజీ.. ఆ తరువాత చంద్రబాబు బరువుపై రెండు రకాల స్టేట్‌మెంట్లు ఇచ్చారు. తొలుత 68 కేజీల బరువు ఉన్నారని, ప్రస్తుతం 67 కేజీలు ఉన్నారన్నారు.

Prisons DIG with Media on Chandrababu Health Condition: చంద్రబాబు ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు: జైళ్ల శాఖ డీఐజీ

TDP is Worried About Chandrababu Health: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. జైలులో చంద్రబాబు నాయుడు ఎండ వేడిమి కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావడం.. అనంతరం ఆయన శరీరంపై పలుచోట్ల దద్దుర్లు రావటం, అలర్జీతో బాధపడటంపై కుటుంబ సభ్యులు, ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Nara Bhuvaneshwari Tweet: 'జైలులో ఉన్న నా భర్త క్షేమం గురించి నాకు ఆందోళనగా ఉంది. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారు. మరో రెండు కిలోలు తగ్గితే ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. జైల్లోని నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండటంతో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల వల్ల ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది' అని చంద్రబాబు సతీమణీ నారా భువనేశ్వరి తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు.

Govt Doctors Report on Chandrababu Health: ఈ నేపథ్యంలో జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి.. నేడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక బయటకి వచ్చింది. జైలు అధికారులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా ఆ నివేదిక ఉండడంతో సర్వత్రా చర్చ జరుతోంది. ఆ నివేదికలో చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీరభాగాల్లో దద్దుర్లు, స్కిన్‌ అలర్జీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించడంతో చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వం, జైలు అధికారులు చెబుతున్న విషయాలపై ఏదో గోప్యత ఉందనే వాదన పార్టీ అభిమానులు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

చంద్రబాబు భద్రతపై భయమేస్తోంది..బయటికొస్తుంటే సగభాగం వదిలేసి వస్తున్నట్లనిపించిందని భువనేశ్వరి భావోద్వేగం

Last Updated :Oct 15, 2023, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details