తెలంగాణ

telangana

'రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే.. ఆ రోజున ఆందోళన ముగింపు'

By

Published : Nov 30, 2021, 7:03 PM IST

Updated : Nov 30, 2021, 10:38 PM IST

Farmers Protest news: కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించిందని.. దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు తెలిపారు. ఎంఎస్​పీపై చట్టం తీసుకొచ్చేందుకూ సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. ఉద్యమం విరమించే అంశంపై డిసెంబర్ 4న నిర్ణయం తీసుకుంటామన్నారు.

Farmers Protest news
Farmers Protest news

Farmers protest end: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు కీలక ప్రకటన చేశారు. చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా తమ డిమాండ్లన్నింటినీ అంగీకరించిందని రైతు నాయకుడు సత్నామ్ సింగ్ తెలిపారు. నిరసన విరమించే అంశంపై డిసెంబర్ 4న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

32 రైతు సంఘాలు కలిసి సోనీపత్​లోని కుండ్లీ సరిహద్దు వద్ద సమావేశమయ్యాయి. ఈ భేటీలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు సత్నామ్ సింగ్ వెల్లడించారు. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ఒప్పుకుందని తెలిపారు. చట్టం కోసం కమిటీ ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం ఐదుగురు పేర్లను సిఫార్సు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చాకు సూచించిందని చెప్పారు.

దీంతో పాటు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర హోంశాఖ లేఖలు పంపిందని చెప్పారు సత్నామ్ సింగ్. డిసెంబర్ 1 లేదా 4వ తేదీన మరోసారి సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం అవుతుందని వెల్లడించారు. కమిటీ సభ్యుల పేర్లతో పాటు తదుపరి కార్యాచరణపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు.

'మాతో భేటీ అయితేనే..'

అయితే, బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ మాత్రం తమ డిమాండ్లను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని తెలిపారు. డిసెంబర్ 4న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరగడానికి ముందే.. కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై తమకు ముందుగానే హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:కుమారుడి కోసం చిరుతతో తల్లి వీరోచిత పోరాటం

Last Updated :Nov 30, 2021, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details