తెలంగాణ

telangana

పదో తరగతి విద్యార్థినిని సజీవదహనం చేసిన దుండగులు- అదే కారణమా?

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 9:09 PM IST

Girl Burnt In Panjab : పదో తరగతి చదువుతున్న యువతిని గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేశారు. ఈ ఘటన పంజాబ్​లో వెలుగుచూసింది.

18 Year Old Girl Burnt Alive
18 Year Old Girl Burnt Alive

Girl Burnt In Panjab : 18 ఏళ్ల యువతిని గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేసిన ఘటన పంజాబ్​లో జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
జలంధర్​లోని బస్తీ బవాఖేల్దాకు చెందిన ఓ యువతి పదో తరగతి చదువుతోంది. అయితే అకస్మాత్తుగా మంగళవారం నుంచి ఆమె కనిపించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు యువతి కోసం వెతికారు. అయినప్పటికీ యువతి ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు యువతి తల్లిదండ్రులు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి స్పోర్ట్స్ కాలేజ్​ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితుల వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.

యువతిపై యాసిడ్​ దాడి
తనతో పెళ్లికి నిరాకరించిందని టాయ్​లెట్​ శుభ్రం చేసే యాసిడ్​తో యువతిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన రాజస్థాన్​లోని అజ్​మేర్ ​జిల్లాలో బుధవారం జరిగింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలప్రకారం
అజ్​మేర్​​ జిల్లాలోని రామ్​గంజ్ పోలీస్​ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి వెంట కొంతకాలంగా పడుతున్నాడు. అయితే పెళ్లి విషయాన్ని అతడు పలుమార్లు యువతి వద్ధ ప్రస్తావించగా అందుకు ఆమె నిరాకరిస్తూ వచ్చింది. నిందితుడు పథకం ప్రకారం బుధవారం యువతి ఇంట్లోని వెనుక ద్వారం ద్వారా ప్రవేశించాడు. అందులో నుంచి బయటకు తెచ్చేసేందుకు సిద్ధమయ్యాడు. అందుకు బాధితురాలు నిరాకరించడం వల్ల ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమె ముఖంపై టాయ్​లెట్ క్లీన్ చేసే యాసిడ్​ను పోసేశాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు ఫొటోగ్రాఫర్​గా పనిచేస్తున్నాడని వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పేలిన కారు టైరు- డంపర్​ను ఢీకొట్టగానే మంటలు- 8 మంది సజీవదహనం

కట్నం కోసం నాలుగు నెలల గర్భిణీకి నిప్పు.. వారంపాటు నరకం అనుభవించి మృతి

ABOUT THE AUTHOR

...view details