తెలంగాణ

telangana

'బీజేపీ గోమూత్ర రాష్ట్రాల్లో మాత్రమే గెలుస్తుంది'- లోక్​సభలో డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

By PTI

Published : Dec 5, 2023, 7:41 PM IST

Updated : Dec 5, 2023, 8:57 PM IST

Gaumutra Row In Lok Sabha : బీజేపీ కేవలం గోమూత్ర అని పిలుచుకునే హిందీ రాష్ట్రాల్లో మాత్రమే గెలువగలుతుందని అన్నారు డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్. పార్లమెంట్ వేదికగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

gaumutra row in lok sabha
gaumutra row in lok sabha

Gaumutra Row In Lok Sabha : భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కమలం పార్టీ కేవలం గోమూత్ర అని పిలుచుకునే హిందీ రాష్ట్రాల్లో మాత్రమే గెలువగలుగుతుందని అన్నారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లులపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. జమ్ముకశ్మీర్‌లో గెలవలేమని తెలిసే ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, గవర్నర్‌ ద్వారా అధికారం చెలాయిస్తోందని ఎంపీ సెంథిల్‌ కుమార్‌ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా గెలువలేదని జోస్యం చెప్పారు.

"బీజేపీ ఇటీవలి కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచింది. మైక్రో మేనేజ్‌మెంట్ ద్వారా వరుసగా ఎన్నికల్లో గెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లో ఏమైంది? అక్కడ ఎందుకు గెలవలేకపోయారు. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసి గవర్నర్‌ ద్వారా అధికారం చెలాయిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో గెలిచే సత్తా, సమర్థత ఉంటే కేంద్రపాలిత ప్రాంతం చేసేవారు కాదు. బీజేపీ అధికారం కేవలం గోమూత్ర అని పిలుచుకునే హిందీ రాష్ట్రాల్లోనే అని దేశ ప్రజలు తెలుసుకోవాలి. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు రాలేదు."
--సెంథిల్‌కుమార్‌,డీఎంకే ఎంపీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించే నేపథ్యంలో ఒక అనుచితమైన పదాన్ని ఉపయోగించానని డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఆ పదాన్ని ఏ దురుద్దేశంతోనూ ఉపయోగించలేదని పేర్కొన్నారు. తప్పుడు అర్థం వచ్చేలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరారు సెంథిల్ కుమార్. 'ఎవరి మనోభావాలు దెబ్బతింటాయని నేను అనుకోను. సభలో వివాదాస్పదంగా ఏమీ మాట్లాడలేదు.' అన్నారు.

క్షమాపణలకు డిమాండ్​!
డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ లోక్​సభలో బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. సెంథిల్ కుమార్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సెంథిల్ కుమార్ గోమూత్ర వ్యాఖ్యలు వాడడం దురదృష్టకరమని అన్నారు. 'సెంథిల్ వెంటనే క్షమాపణలు చెప్పాలి. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.' అని అన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 4న ప్రారంభమయ్యాయి. డిసెంబరు 22తో ముగియనున్నాయి.

Last Updated : Dec 5, 2023, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details