తెలంగాణ

telangana

పరీక్ష రాసి వస్తుండగా 12ఏళ్ల బాలిక కిడ్నాప్​.. రెండ్రోజుల పాటు గ్యాంగ్​ రేప్​

By

Published : May 8, 2022, 10:35 AM IST

Gangrape in Madyapradesh: పరీక్ష ముగించుకుని ఇంటికి వెళ్తున్న 12 ఏళ్ల బాలికను అపహరించి రెండ్రోజుల పాటు గ్యాంగ్​ రేప్​కు పాల్పడిన దుర్ఘటన రాజస్థాన్​లోని భరత్​పుర్​ జిల్లాలో జరిగింది. బాధితురాలి నానమ్మ ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. బిహార్​లోని జెహనాబాద్​ జిల్లాలో జరిగిన మరో ఘటనలో పెళ్లి వేడుకలో పాటలు పాడేందుకని పిలిచి సింగర్​పై గ్యాంగ్​ రేప్​కు పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు.

gangrape in bihar
గ్యాంగ్​ రేప్​

Gangrape in Madyapradesh: పరీక్షకు హాజరై తిరిగి ఇంటి వస్తున్న 12 ఏళ్ల విద్యార్థినిని ముగ్గురు దుండగులు అపహరించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన రాజస్థాన్​లోని భరత్​పుర్​ జిల్లాలో వెలుగుచూసింది. చికసానా పోలీస్​ స్టేషన్​లో బాధితురాలి నానమ్మ ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ జరిగింది:ఏప్రిల్​ 30న 19 ఏళ్లు, 12ఏళ్లు వయసున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు పరీక్ష రాసేందుకు పాఠశాలకు వెళ్లారు. పరీక్ష ముగిశాక ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి ఇద్దరు మధ్యాహ్నం 1.30 గంటలకు స్వగ్రామానికి బయలుదేరారు. దారిలో వారిని అడ్డగించిన ముగ్గురు వ్యక్తులు 19 ఏళ్ల యువతిపై దాడి చేసి 12 ఏళ్ల బాలికను అపహరించారు. ఇంటికి చేరిన యువతి జరిగిన సంఘటన గురించి నానమ్మకు తెలిపింది.

నేరుగా నిందితుడి ఇంటికి వెళ్లిన మహిళ.. తన మనవరాలిని స్నేహితులతో కలిసి కిడ్నాప్​ చేసినట్లు కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పింది. రెండు రోజుల్లో బాలికను వెతికి అప్పగిస్తామని వారు హామీ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన బాధిత బాలిక.. తనపై జరిగిన అఘాయిత్యాన్ని నానమ్మకు వివరించింది. నిందితులు ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్టేషన్​ ఇంఛార్జ్​ వినోద్​ కుమార్​ మీనా తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

గాయనిపై గ్యాంగ్​ రేప్​:బిహార్​లోని జెహనాబాద్​ జిల్లాలో ఓ గాయనిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పట్నాలోని రామక్రిష్ణనగర్​లో శుక్రవారం రాత్రి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

జ్యోతి బాబా పత్​లోని ఓ వివాహ వేడుకలో పాటలు పాడేందుకు బాధితురాలిని పిలిచారు. అక్కడికి చేరుకున్న తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న యువతి పక్క గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్​ చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్​ చేసి వారి వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరితో గతంలో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రేమకు నిరాకరించిందని మూడంతస్తుల భవనానికి నిప్పు.. 9 మంది మృతి

మహిళపై తాంత్రికుడి అత్యాచారం.. 79 రోజులు నరకం

ABOUT THE AUTHOR

...view details