తెలంగాణ

telangana

ఆధార్‌, టీకా పత్రం ఉంటేనే మద్యం!

By

Published : Sep 3, 2021, 8:59 AM IST

మద్యం కొనాలంటే ఆధార్ కార్డు, కరోనా వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా చూపాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానాన్ని తమిళనాడు నీలగిరి జిల్లాలో మొదటిసారిగా అమలుచేస్తున్నారు.

liquor
లిక్కర్, మద్యం

ఆధార్‌ కార్డు, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే మద్యం విక్రయించే విధానాన్ని మొదటిసారిగా తమిళనాడులోని నీలగిరి(Nilgiri News) జిల్లాలో అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా.. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు, కరోనా టీకా పత్రం చూపాలని అధికారులు స్పష్టం చేశారు.

జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో 18 ఏళ్లకు పైబడినవారు 5.82 లక్షల మంది ఉండగా ఇప్పటికే 70శాతం మందికి టీకాలు వేశారు.

ఇదీ చదవండి:ఇక నుంచి సార్‌, మేడమ్ వద్దు.. చేటన్‌, చేచి అంటే చాలు!

ABOUT THE AUTHOR

...view details