తెలంగాణ

telangana

ఐదేళ్ల చిన్నారిపై 15ఏళ్ల బాలుడి అత్యాచారం.. చాక్లెట్​ ఇస్తానని..

By

Published : Jun 13, 2022, 5:03 PM IST

Updated : Jun 13, 2022, 5:20 PM IST

చాక్లెట్​ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 15 ఏళ్ల బాలుడు. ఈ ఘటన రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో జరిగింది. తీవ్ర రక్తస్రావం అయిన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు​ పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో ఓ యువకుడు తన సోదరి చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Rape
అత్యాచారం.

దేశంలోని మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిపై పొరుగింటిలో ఉండే ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో ఇల్లు చేరిన బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ జరిగింది:ఆదివారం మధ్యాహ్నం.. ఇంటి సమీపంలో అడుకుంటున్న బాలికను చాక్లెట్ ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు 15 ఏళ్ల బాలుడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఏడుపులతో భయపడి నోరు మూసి వారి ఇంటి వద్ద వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ తన తల్లివద్దకు వెళ్లింది బాలిక. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తెలిసి తెలియని మాటల్లో వివరించింది. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. సాయంత్రంలోపు నిందితుడిని పట్టుకున్నట్లు ప్రతాప్​నగర్​ పోలీసులు చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

సోదరి చితిలో దూకి ఆత్మహత్య:ఓ యువకుడు తన సోదరి చితిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్​లోని సాగర్​ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగింది. బహారియా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మఝ్గువా గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమెకోసం కుటుంబ సభ్యులు వెతకగా.. వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న అతడి బంధువు కరణ్​(18).. ధార్​ ప్రాంతం నుంచి 430 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై సాగర్​కు చేరుకున్నాడు. శుక్రవారం సాయంత్రం యువతి అంత్యక్రియలను నిర్వహించగా.. ఆమె చితిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే మంటల్లోంచి బయటకు లాగి, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు కరణ్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చూడండి:ప్రియుడి కోసం భర్త హత్యకు భార్య సుపారీ.. వారి​ పేరు చెప్పి డ్రామా.. చివరకు..

'ఆన్​లైన్​ బెట్టింగ్'​పై కేంద్రం సీరియస్.. ఇక అవన్నీ బంద్!

Last Updated : Jun 13, 2022, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details