తెలంగాణ

telangana

ఉస్మానియాలో ఇద్దరు మృతి - వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధరణ

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 2:18 PM IST

Updated : Dec 26, 2023, 7:33 PM IST

First Corona Death Telangana Today : దాదాపు ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. హైదరాబాద్​ ఉస్మానియా ఆస్పత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చేరిన ఓ రోగి మృతి చెందాడు. మరొకరు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి రాగ ఇద్దరికి చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధరణ అయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు.

Corona Death in hyderabad
Corona Death in Telangana

First Corona Death Telangana Today 2023 :తెలంగాణలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ జేఎన్1 కూడా రాష్ట్రంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో తొలి కరోనా మరణం (Corona Death in Telangana) నమోదైనట్లు తెలుస్తోంది.

దేశంలో కొత్తగా 412 కొవిడ్​ కేసులు- ఆ రాష్ట్రంలో ముగ్గురు మృతి

First Covid Death Telangana Today 2023 :హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో ఉస్మానియాలో చేరిన రోగి మృతి చెందాడు. సమస్య తీవ్రం కావడం వల్లే రోగి మృతి చెందారని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. అయితే ఈ రోగికి చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధరణ అయినట్లు చెప్పారు.

Hyderabad Reporting Major Covid Cases in Telangana : కొవిడ్ వైరస్ మరోమారు వేగంగా వ్యాపిస్తోంది. గడచిన వారం రోజుల్లోనే ఏకంగా 55 మందికి వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. అందులోనూ హైదరాబాద్‌లోనే దాదాపు 90 శాతానికి పైగా కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోన్న అంశం. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పది కోవిడ్ కేసులు నమోదైతే అందులో 9 కేసులు నగరవాసులేవేనని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోన్న జేఎన్ 1 సబ్ (JN.1 Covid Cases in Telangana)వేరియంట్ కేసులు సైతం తెలంగాణలో రెండు నమోదైనట్టు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

PrathiDwani: చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి

ఉస్మానియా ఆస్పత్రిలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో చనిపోయిన ఇద్దరిలో కొవిడ్ గుర్తించినట్టు ఆస్పత్రి వర్గాలు సైతం ధ్రువీకరించాయి. మరో ముగ్గురు కొవిడ్ రోగులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్న ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు.

Covid New Variant Symptoms : ఈ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయనిల వైద్యులు వివరించారు. కొంత మందిలో శ్వాస తీసుకోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాతయని వెల్లడించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Government Actions on Corona Treatment in Gandhi Hospital: రాష్ట్రంలో కొవిడ్ కేసులు (Telangana Covid Cases) నమోదవుతున్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా చికిత్సకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజరావు వెల్లడించారు. ప్రస్తుతం సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు వైద్యులు చెప్పారు.

Doctors Corona Instructions to Public :వృద్ధులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు సమూహంగా ఉన్న జనంలోకి వెళ్లకపోవడం, మాస్క్​ ధరించడం మంచిదని తెలిపారు. రోగనిరోధక శక్తి పెంచేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలనన్నారు. ప్రభుత్వం తెలిపిన కొవిడ్ నియమాలను తప్పక పాటించాలని సూచించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని వైద్యులు వెల్లడించారు.

కరోనా కొత్త కలవరం - ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

'కరోనా న్యూ వేరియంట్​పై అప్రమత్తంగా ఉండాలి - స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి'

Last Updated : Dec 26, 2023, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details