తెలంగాణ

telangana

దేశ సైనికుల కోసం రోబో.. బాలమేధావి ఆవిష్కరణ

By

Published : Apr 20, 2022, 12:54 PM IST

fifth class student made Robot: పంజాబ్​లోని లుథియానాకు చెందిన ఓ విద్యార్థి అద్భుతం చేశాడు. చదివేది ఐదో తరగతి అయినా.. భారత సైన్యానికి ఉపయోగపడే రోబోను తయారు చేశాడు. కేవలం రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్ట్​ను పూర్తి చేశానని చెబుతున్నాడు ఈ బాలమేధావి. ఈ విద్యార్థి గురించి మరింత తెలుసుకుందామా..?

fifth class student made Robot
ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్న భవ్య జైన్

రోబోను తయారుచేసిన బాలమేధావి

fifth class student made Robot: ఈ బాలుడు చదువుతున్నది ఐదో తరగతే.. అయితేనేం..? ఆర్మీ కోసం వినూత్న ఆలోచన చేశాడు. రెండు నెలల్లోనే రోబోను ఆవిష్కరించాడు. సైనిక అవసరాలకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించాడు పంజాబ్​లోని లుథియానాకు చెందిన భవ్య జైన్. శత్రు భూభాగంలో ఏ చిన్న వస్తువునైనా ఈ రోబో కనిపెట్టగలదని చెబుతున్నాడు. భవిష్యత్​లో మరిన్ని ప్రయోగాలు చేస్తానని అంటున్నాడు ఈ బాలమేధావి.

రోబోను తయారుచేసిన ఐదో తరగతి విద్యార్థి భవ్య జైన్

"ఈ రోబో పేరు జార్విస్. ఆర్మీ, ఇతర రంగాల వారికి ఈ రోబో ఉపయోగపడుతుందని తయారు చేశా. ఇందులో 360 డిగ్రీల్లో పనిచేసే కెమెరా ఉంది. ఈ రోబోకు చెయ్యి అమర్చా. అది వస్తువులను ఎత్తడానికి, కిందికి దించడానికి ఉపయోగపడుతుంది. ఈఎస్​బీ-32 అనే నెట్​వర్క్ ద్వారా ఈ రోబో పనిచేస్తుంది. ఈ నెట్​వర్క్​ను లాప్​టాప్​, మొబైల్ ఫోన్​కు కనెక్ట్​ చేసి ఈ రోబోను నియంత్రించవచ్చు."

-భవ్య జైన్​, రోబో సృష్టికర్త

ఈ ప్రాజెక్ట్ వల్ల తనకు మంచి గుర్తింపు లభించిందని భవ్య జైన్ అంటున్నాడు. అతి చిన్న వయసులోనే రోబో తయారు చేయడం వల్ల ఇటీవలే ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. భవ్య జైన్ సాధించిన విజయం పట్ల అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సైన్యానికి ఉపయోగపడే రోబోను తమ విద్యార్థి తయారు చేయడం గర్వంగా ఉందని అంటున్నారు.

ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్న భవ్య జైన్

ఇదీ చదవండి:ఏకకాలంలో రెండు డిగ్రీలు.. భారతీయ​, విదేశీ విద్యాసంస్థలు కలిసి!

ABOUT THE AUTHOR

...view details