తెలంగాణ

telangana

సబ్బుల్లో కొకైన్ స్మగ్లింగ్.. రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

By

Published : Feb 28, 2023, 11:04 PM IST

ముంబయిలోని విమానాశ్రమంలో ఓ ప్రయాణికుడి నుంచి 2.58 కిలోల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. వీటి విలువ దాదాపు 25 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలిపారు.

Cocaine Drugs Seized In Mumbai Airport
ముంబయి ఎయిర్​పోర్టులో కొకైన్ డ్రగ్ పట్టివేత

డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు అధికారులు. విదేశాల నుంచి రహస్యంగా కొకైన్​ను భారత్​కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇథియోపియా నుంచి కొకైన్​ను గుట్టుగా తీసుకొచ్చాడు. సబ్బు డబ్బాల్లో డ్రగ్స్​ను నింపి తరలిస్తున్నాడు. అయితే, ఈ అక్రమ రవాణాపై అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో చాకచక్యంగా స్మగ్లర్​ను పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..
ముంబయి డైరెక్టెరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. నిందితుడు ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు.. ముంబయి ఎయిర్​పోర్ట్​లో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఓ విదేశీయుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అడ్డుకొని తనిఖీలు నిర్వహించారు. దీంతో అతడి వద్ద ఉన్న కొకైన్ బయటపడింది. సబ్బు డబ్బాల్లో కొకైన్​ నింపి తరలిస్తున్నాడు ఆ నిందితుడు. కొకైన్ మొత్తం బరువు 2.58 కిలోలు ఉందని అధికారులు వెల్లడించారు. మొత్తం 12 సబ్బు డబ్బాలు ఉన్నాయని చెప్పారు.

సబ్బు బార్లలో కొకైన్​ డ్రగ్​
సబ్బు బార్లలో కొకైన్​ డ్రగ్​

అక్రమ తరలిస్తున్న ఈ కొకైన్​ విలువ అంతర్జాతీయ మార్కెట్ విలువ ప్రకారం.. రూ. 25 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు తమ అదుపులోనే వారు వెల్లడించారు. కాగా ప్రదాన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. మరో ప్రయాణికుడిని సైతం అరెస్ట్​ చేసినట్లు వారు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు.

సబ్బు బార్లలో కొకైన్​ డ్రగ్​

100 కేజీల బంగారం
కాగా, ఇటీవల నిఘా వర్గాల సమాచారంతో ఆపరేషన్ గోల్డెన్ డాన్ పేరుతో దేశవ్యాప్తంగా అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 100 కిలోలకు పైగా బంగారాన్ని సీజ్ చేశారు. ఈ బంగారం విలువ రూ.51 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. అప్పుడు సైతం మహారాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులే సోదాలు జరిపారు. భారత్ నేపాల్ సరిహద్దులతో పాటు దేశంలోని కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పట్నా, పుణె, ముంబయిలలో తనిఖీలు జరిపారు. ఈ ఘటనలో 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో పలువురు విదేశీయులు సైతం ఉన్నారు. నిందితుల నుంచి 1.35 కోట్లు విలువ చేసే దేశ, విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details