తెలంగాణ

telangana

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

By

Published : Dec 19, 2021, 5:23 AM IST

Updated : Dec 19, 2021, 9:32 AM IST

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Encounter
ఉగ్రవాది హతం

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్​లోని హర్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో గుర్తు తెలియని ఓ ముష్కరుడ్ని పోలీసులు హతమార్చారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

హర్వాన్​లో భద్రతా దళాల వాహనాలు
.

హర్వాన్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు.

ఎన్​కౌంటర్ జరిగిన ప్రాంతంలో సాయుధ సిబ్బంది

ముష్కరులకు, పోలీసులుకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో మోస్ట్​ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

Last Updated : Dec 19, 2021, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details