తెలంగాణ

telangana

బంగాల్​లో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు​ వాయిదా!

By

Published : May 3, 2021, 10:44 PM IST

బంగాల్​లోని జంగీపుర్, శంషేర్‌గంజ్‌ నియోజకవర్గాలకు మే 16న జరగనున్న ఎన్నికలను కరోనా ఉద్ధృతి దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవల ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి మరణించడంతో జంగీపుర్, కాంగ్రెస్‌ అభ్యర్థి మృతితో శంషేర్‌గంజ్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Election Commission
ఎన్నికల సంఘం

బంగాల్​లో ఈనెల 16న జంగీపుర్, శంషేర్‌గంజ్‌ నియోజకవర్గాలకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల సంఘం. కరోనా మహమ్మారి విజృంభణతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు 8 విడతల్లో ఇటీవలే ముగిశాయి. వాటితో పాటే ఈ రెండు నియోజకవర్గాలకు పోలింగ్​ జరగాల్సింది. కానీ, ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి మరణించడంతో జంగీపుర్, కాంగ్రెస్‌ అభ్యర్థి మృతితో శంషేర్‌గంజ్‌ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఈ రెండు నియోజకవర్గాలతోపాటు బంగాల్​లో మరో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక తప్పనిసరైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దహా స్థానానికి గత నెల 22న పోలింగ్‌ జరిగింది. అక్కడ తృణమూల్‌ తరపున పోటీ చేసిన కాజల్‌ సిన్హా తాజా ఫలితాల్లో గెలుపొందారు. అయితే, కొవిడ్‌ సోకిన సిన్హా.. ఎన్నికల ఫలితం రాకముందే (గత నెల 25న) మృతి చెందారు.

అయితే.. ఈ మూడు స్థానాల్లో ఏదో ఒకదాన్నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి :'మోదీ జీ.. విదేశాల సాయం వివరాలు వెల్లడించండి'

ABOUT THE AUTHOR

...view details