తెలంగాణ

telangana

ఆన్​లైన్ ప్రచారంలో నేతలు- ఎన్నికల వ్యాపారం డీలా, గిరాకీ లేక దుకాణాలు వెలవెల!

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 7:59 AM IST

Election Business Online Campaign Effect : ఎన్నికలంటనే వివిధ పార్టీల భారీ బహిరంగ సభలు, పెద్ద పెద్ద ర్యాలీలు, వాటిలో పార్టీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలు, పార్టీ గుర్తున్న టోపీలు పెట్టుకున్న యువత, పార్టీ జెండా రంగు ఉన్న టీషర్టులను ధరించిన అభిమానులు కనిపిస్తారు. కాలం వేగంగా మారుతున్న ఈ తరుణంలో ఎన్నికల ప్రచారమూ కొత్తపుంతలు తొక్కుతోంది. కొన్నేళ్లుగా అన్ని రాజకీయపార్టీలు సామాజిక మాధ్యమాలు, మీడియానే ప్రచారవేదికగా మార్చుకోవడంతో ఎన్నికలపై ఆధారపడ్డ చాలా వ్యాపారాలు.. ఇప్పుడు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి.

Election Business Online Campaign Effect
Election Business Online Campaign Effect

Election Business Online Campaign Effect :మారుతున్న కాలంతోపాటు ఎన్నికల ప్రచారం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు తోడు.. సామాజిక మాధ్యమాలు ఎన్నికలపై గట్టి ప్రభావం చూపుతున్నాయి. యువత ఎక్కువ సమయం ఫోన్లలోనే సమయం కేటాయిస్తున్నారు కాబట్టి.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు.. పార్టీలు కూడా సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వేదికగా చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారం డిజిటల్‌ బాటపట్టడంతో పార్టీల జెండాలు, టోపీలు, టీషర్టులు, కీచైన్‌లు, కండువాలు, బెలూన్లు వంటివాటిని అమ్మే వ్యాపారాలకు గిరాకీ బాగా తగ్గిపోయింది.

'సగం కూడా అమ్మలేకపోతున్నాం..'
Social Media Campaign effect Election Business :మధ్యప్రదేశ్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో తమ వ్యాపారాలు ఉచ్ఛస్థితిలో ఉంటాయనీ.. కానీ ఈ సారి అది చాలా వరకు తగ్గిపోయిందని ఎన్నికల జెండాలు ఇతరత్రాలను అమ్మే వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సగం కూడా అమ్మలేకపోతున్నామని తెలిపారు.

"సోషల్ మీడియా ప్రభావంతో మా వ్యాపారంలో దాదాపు 80 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు రూ.100 వచ్చే వ్యాపారంలో ఇప్పుడు కేవలం రూ. 20 మాత్రమే వస్తున్నాయి. ఇలాంటి పీక్‌ సీజన్‌లో మాట్లాడటానికి కూడా సమయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు గిరాకీ లేక మౌనంగా కూర్చున్నాము. సోషల్ మీడియా ఇక్కడ చాలా ప్రభావం చూపింది."
-అజయ్‌ అగర్వాల్‌, వ్యాపారి

"ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వార్తలు చాలా త్వరగా ప్రజలకు చేరుతున్నాయి. మొబైల్స్, ఎలక్ట్రానిక్ మీడియా కారణంగా మా వ్యాపారంపై పెద్ద ప్రభావం పడింది."
-గులాబ్‌రావ్‌ పవార్‌, వ్యాపారి

'సామాజిక మాధ్యమాల వల్లే కాకపోవచ్చు..'
ప్రజలంతా కొత్తదనం కోసం చూస్తారనీ ఇది కూడా అందుకు మినహాయింపు కాదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం సామాజిక మాధ్యమాల వల్లే తమ వ్యాపారం దెబ్బతింటుందని చెప్పలేమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసీ, ఇన్‌కం టాక్స్‌కు భయపడి ఎన్నికల అభ్యర్థులు.. ప్రచారంలో ఎన్నికల సామాగ్రిపై డబ్బును తక్కువగా ఖర్చు చేస్తుండటం కూడా కారణం కావచ్చని తెలిపారు.

ప్రచారంలో అయోధ్య వేడి!
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధితో పాటు ఇతర అంశాలూ ప్రచారంలో హాట్ టాపిక్​గా మారాయి. అయోధ్య రామ మందిరం నిర్మాణ విషయం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాక పుట్టిస్తోంది. ఆ రాష్ట్రంలో రామ మందిర విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Ex CMs Relatives In MP Assembly Polls : మధ్యప్రదేశ్​ బరిలో 10 మంది మాజీ సీఎంల బంధువులు.. అదృష్టం వరించేనా?

Madhya Pradesh Assembly Election 2023 : కమల్​నాథ్ కంచుకోటలో పాగాకు బీజేపీ ప్లాన్​.. దేవుని విగ్రహాల చుట్టూ రాజకీయం!

ప్రచారంలో కాంగ్రెస్​ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్​ జోష్​, డైలమాలో బీజేపీ!

ABOUT THE AUTHOR

...view details