తెలంగాణ

telangana

80 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కాచెల్లెళ్లు.. హామ్ రేడియో సహాయంతో గుర్తింపు.. కానీ అప్పటికే!

By

Published : Mar 7, 2023, 10:23 PM IST

elderly women meets family
elderly women meets family ()

80 ఏళ్ల క్రితం ఇద్దరు తోబుట్టువులు విడిపోయారు. మళ్లీ కలుసుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. బంగ్లాదేశ్​- బంగాల్​లో ఉన్న అక్కాచెల్లెళ్లు కలిశారా? అసలేం జరిగింది. ఇన్నాళ్లు ఎందుకు కలవలేకపోయారో? ఈ కథనం చదివి తెలుసుకోండి.

జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమానురాగాలు చూపించేది తోబుట్టువులపైనే. అలాంటి తోబుట్టువుల మనకు కొంత కాలం దూరమైతేనే.. వారు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలియక బాధపడుతుంటాం. దీంతో పాటుగా ఎప్పుడెప్పడు మాట్లాడుతామా, కలుస్తామా అని ఎదురుచూస్తుంటాం. అలాంటిది ఇద్దరు అక్కాచెల్లెల్లు దాదాపు 80 సంవత్సరాల క్రితం విడిపోయారు. అయితే వీరిద్దరిలో ఓ వృద్ధురాలు తన కుమారుడి సాయంతో చిన్నప్పుడు తన నుంచి వేరైన తన సోదరిని కలుసుకోవాలని ఆశపడింది. దీంతో తన తల్లి కోరిక మేరను అతను హామ్​ రేడియో సాయంతో తన పెద్దమ్మ కుటుంబాన్ని గుర్తించాడు. అనంతరం తన తల్లితో.. పెద్దమ్మ కుమారుడితో వీడియోకాల్​లో మాట్లాడించాడు. 1940 విడిపోయి.. 80 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ రెండు కుటుంబాల కథేంటో తెలుసుకుందామా.

వీరి కథేంటంటే..?
వీరి కథ 1940 నాటిది. ఆ కాలంలో భారతదేశంలో స్వాతంత్య్రం కోసం ముమ్మరంగా ఉద్యమ పోరాటాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో భారత్, బంగ్లాదేశ్​ల మధ్య ఎటువంటి సరిహద్దు రేఖలు లేవు. రెండు ప్రాంతాలు కలిసే ఉండేవి. అయితే అదే సమయంలో మాయాదేవి చక్రవర్తి, బినాపాణి చక్రవర్తి అనే ఇద్దరు సోదరీమణులు బంగ్లాలోని ష్లియెట్ ప్రాంతం నుంచి భారత్​లోని కోల్​కతాకు చేరుకున్నారు. ఆ తర్వాత భారత్- బంగ్లా విభజన సమయంలో మాయాదేవి బంగాల్​లో ఉండేందుకు సిద్దపడగా.. బినాపాని బంగ్లాదేశ్​కు తిరిగి చేరుకుంది. ఆ కాలంలో టెక్నాలజీ అంతగా లేకపోవడం వల్ల ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా పోయింది. దీంతో వీరిద్దరు వేరువేరు దేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం మాయాదేవి వయస్సు దాదాపుగా 90 సంవత్సరాలు పైబడి.. తన కుటుంబంతో కలిసి దక్షిణ24 పరగణాల ప్రాంతంలో నివాసం ఉంటుంది. తన సోదరి వివరాలు తెలియనందుకు మాయాదేవి 70 ఏళ్లుగా బాధపడుతూనే ఉండేది. తన కుమారుడి ద్వారా తన సోదరి బినాపాణి ఆచూకీ తెలుసుకోవాలని ఆశపడేది.

తన సోదరి బినాపాణి కుటుంబసభ్యులతో వీడియో కాల్​ మాట్లాడుతున్న మాయాదేవి

ప్రస్తుతం మాయాదేవి కుమారుడు సువేందు బంగాల్ పోలీసు డిపార్ట్​మెంట్​లోని సైబర్​ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. తన తల్లి కోరిక మేరకు సువేందు తన శాఖా పరమైన పరిచయాలను ఉపయోగించి బినాపాణి కుటుంబం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసినా సరే అవి ఫలించలేదు. దీంతో సువేందు బంగ్లాలో హామ్​ రేడియోకు చెందిన సోహెల్​ రానాతో పరిచయం పెంచుకున్నారు. సువేందు తనకు పరిచమైన సోహెల్​ సాయంతో హామ్​ రేడియో సాంకేతికతను ఉపయోగించి.. బంగ్లాదేశ్​లోని హబీగంజ్​ ప్రాంతంలో ఉన్న తన తల్లి సోదరి బినాపాణి కుటుంబసభ్యులను కనుగొన్నారు. సువేందు హామ్​ రేడియో ద్వారా బినాపాణి కుమారుడైన రంజిత్​ చక్రవర్తితో ఫోన్​లో మాట్లాడారు. బాధాకరమైన విషయం ఏంటంటే.. అప్పటికే బినాపాణి మరణించి 15 ఏళ్ల గడిచిందని రంజిత్ తన సోదరుడు సువేందుకు తెలిపాడు. తన సోదరి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న మాయాదేవి.. బాధపడుతూ తన సోదరి కుమారుడు, అతని కుటుంబసభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి భావోద్వేగానికి లోనైంది. అయితే ఇన్నేళ్ల తర్వాత తన తల్లి కోరిక తీర్చినందుకు ఆనందంగా ఉందని సువేందు వెల్లడించారు.

బినాపాణి కుమారుడు రంజిత్​ చక్రవర్తి

ABOUT THE AUTHOR

...view details