తెలంగాణ

telangana

ఆమ్నెస్టీ ఇండియాకు ఈడీ షాక్.. రూ.61.72 కోట్ల జరిమానా

By

Published : Jul 9, 2022, 8:22 AM IST

amnesty India news: భారత విదేశీమారకద్రవ్య చట్టం ఉల్లంఘించిన నేరానికి ఆమ్నెస్టీ ఇండియాతో పాటు ఆ సంస్థ మాజీ సీఈవో ఆకార్‌ పటేల్‌కు రూ.61.72 కోట్ల జరిమానా విధించింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఈడీ ప్రత్యేక డైరెక్టర్​ ఈ కేసులో విచారణ జరిపారు. ఈ చర్యను న్యాయస్థానంలో సవాలు చేస్తామని ఆకార్ పటేల్ అన్నారు.

amnesty india international
ఆమ్నెస్టీ ఇండియా

amnesty India news: ఆమ్నెస్టీ ఇండియాతో పాటు ఆ సంస్థ మాజీ సీఈవో ఆకార్‌ పటేల్‌ భారత విదేశీమారకద్రవ్య చట్టం ఉల్లంఘించిన నేరానికి రూ.61.72 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఫెమా చట్టం కింద ఆమ్నెస్టీ ఇండియాకు రూ.51.72 కోట్లు, ఆకార్‌ పటేల్‌కు రూ.10 కోట్లు జరిమానా విధించినట్లు నోటీసులు జారీ చేసింది. ఈడీ ప్రత్యేక డైరెక్టర్ ఈ కేసులో విచారణ జరిపారు.

'ఈడీ ప్రభుత్వ సంస్థే.. కోర్టు కాదు. ఈ చర్యను న్యాయస్థానంలో సవాలు చేస్తాం' అని ఆకార్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. లండన్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారత్‌లోని తన ప్రతినిధులకు భారీ మొత్తంలో విదేశీ నిధులు పంపినట్లు అభియోగం. 2013- 2018 మధ్యకాలంలో వ్యాపార లావాదేవీల పేరిట ఈ నిధుల మార్పిడి జరిగింది. విదేశీ సహాయ క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కళ్లుగప్పి ఇదంతా జరిగినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details