తెలంగాణ

telangana

దిల్లీ మద్యం కేసు.. వైసీపీ ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు

By

Published : Mar 16, 2023, 3:40 PM IST

Updated : Mar 16, 2023, 5:03 PM IST

Delhi ED
Delhi ED ()

Delhi ED call MP Magunta in liquor scam: దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి.. ఒంగోలు వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డికీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జారీ చేసిన నోటీసులో ఈనెల 18వ తేదీన విచారణకు రావాలని మాగుంటను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టై జైలులో ఉన్నారు. ఈ క్రమంలో శ్రీనివాసులు రెడ్డికీ కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Delhi ED call MP Magunta in liquor scam: దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఒంగోలు వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డికీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నేడు నోటీసులు జారీ చేసింది. జారీ చేసిన నోటీసులో ఈనెల 18వ తేదీన విచారణకు రావాలని మాగుంటను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టై జైలులో ఉన్నారు.

ఈ క్రమంలో ఈడీ దిల్లీ మద్యం కుంభకోణంలో సిండికేట్‌ ఏర్పాటు, ముడుపులు ముట్టజెప్పడంలో.. మాగుంట రాఘవ్‌ కీలకపాత్ర పోషించారని ఈడీ ఇప్పటికే స్పష్టం చేసింది. దిల్లీ మద్యం విధానంలో మద్యం ఉత్పత్తిదారులకు రిటైల్‌ జోన్లు ఉండరాదనే నిబంధనకు విరుద్ధంగా.. మాగుంట ఆగ్రో ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో దిల్లీలో రెండు రిటైల్‌ జోన్లను రాఘవ తన గుప్పిట్లో పెట్టుకున్నారని ప్రస్తావించింది. మాగుంట ఆగ్రోఫామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భాగస్వాములుగా కాగితాల్లో పేర్కొన్న పేర్లన్నీ డమ్మీలేనని ఈడీ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారానే రాఘవ్‌.. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం దక్కించుకున్నట్లు ఈ కేసులో నిందితుడుగా ఉన్న సమీర్‌ మహేంద్రు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.

అనంతరం కొత్త మద్యం విధానాన్ని అనుసరించి దిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తాను చాలా ఆసక్తితో ఉన్నానని, ఇక్కడ వ్యవహారాలన్నీ రాఘవ్‌ చూసుకుంటారని శ్రీనివాసులు రెడ్డి అన్నట్లు..కేసులో మరో నిందితుడు అరుణ్‌ పిళ్లై చెప్పారని ఈడీ తెలిపింది. మద్యం విధానంలోని విషయాలను లోతుగా తెలుసుకోవడానికి తాను దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యానని, ఇక్కడి వ్యాపారంలోకి ఆయన తనను ఆహ్వానించారని శ్రీనివాసులు రెడ్డి తమతో అన్నట్లు అరుణ్‌ పిళ్లై స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఫిబ్రవరి 25వ తేదీన ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తన కుమారుడు రాఘవ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే తామంతా ధైర్యంగా ఉన్నామని తెలిపారు. దాదాపు 70 ఏళ్లుగా తమ కుటుంబంలో వ్యాపారంలో ఉందని, 10 రాష్ట్రాల్లో తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. వ్యాపారపరంగా తనకూ 50 ఏళ్ల అనుభవం ఉందని, ఇంతవరకూ ఎక్కడా తప్పుచేయలేదన్నారు. తన కుమారుడు అరెస్టు తర్వాత కోర్టు వద్ద కలిసి మాట్లాడగా... '‘నాన్నా, నీకు తలవంపులు తెచ్చే పని ఎప్పుడూ చేయను. పెద్దనాన్న సుబ్బరామిరెడ్డి గారి పేరును అప్రతిష్ఠపాలు చేయను' అంటూ’ తనకే ధైర్యం చెప్పాడన్నారు.

ఈ నేపథ్యంలో దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డికీ నోటీసులు జారీ చేయడం, ఈనెల 18వ తేదీన విచారణకు రావాలంటూ పేర్కొనడంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన ఆమెను వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

ఇవీ చదవండి

Last Updated :Mar 16, 2023, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details