తెలంగాణ

telangana

Dussehra Celebration Modi : 'ప్రతి ఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయాలి.. ఒక్క పేద కుటుంబాన్నైనా ఆదుకోవాలి!'

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 7:25 PM IST

Updated : Oct 24, 2023, 7:45 PM IST

Dussehra Celebration Modi Speech : దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క పేద కుటుంబ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో సహాయపడాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. దిల్లీలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న మోదీ.. రావణ దహనం చేశారు.

Dussehra Celebration Modi
Dussehra Celebration Modi

Dussehra Celebration Modi Speech :దేశంలోని ప్రతి ఒక్కరూ పది ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కనీసం ఒక్క పేద కుటుంబ సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో సహాయపడాలని కోరారు. దిల్లీ ద్వారకాలోని డీడీఏ మైదానంలో మంగళవారం సాయంత్రం జరిగిన దసరా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆయన రావణ దహనం చేశారు.

"దేశ ప్రజలందరికీ నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక. చంద్రుడిపై కాలుమోపిన రెండు నెలల తర్వాత ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. రావణ దహనం అనేది కేవలం రావణుడి దిష్టిబొమ్మ దహనం చేయడమే కాదు. కులతత్వం, ప్రాంతీయత పేరుతో దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్న శక్తులకు సంబంధించినది కూడా. విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ చేయడం కొన్ని తరాలుగా ఆనవాయితీగా వస్తోంది. భారత్​లో ఆయుధ పూజ కేవలం తమ సంక్షేమం కోసమే కాకుండా ప్రపంచ సంక్షేమం కోసం చేస్తారు"

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అంతకుముందు డీడీఏ మైదానానికి చేరుకున్న ప్రధాని మోదీకి కార్యక్రమ నిర్వాహకులు రామ్​ దర్బార్​ విగ్రహంతో ఘనస్వాగతం పలికారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలు పోషించి వేదికపై రామ్​లీలా ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు మోదీ హారతులిచ్చారు.

ఎర్రకోటలో ముర్ము..
Dussehra Celebration President Murmu :మరోవైపు, దిల్లీలోని ఎర్రకోటలో ధార్మిక లీలా కమిటీ ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ప్రసంగించారు. "నేడు మనం అవినీతి నుంచి ఉగ్రవాదం వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఆ సవాళ్లను అధిగమించడానికి శ్రీరాముడి సిద్ధాంతాలు మనకు ఉపయోగపడతాయి. రాముడు రావణుడిని ఓడించినట్లే మనం ఆధునిక 'రావణుడిని' కూడా ఓడించాలి" అని ముర్ము పిలుపునిచ్చారు.

రావణ దహనం చేసిన సోనియా
Dussehra Celebration Sonia Gandhi :ఎర్రకోట మైదానంలో నవశ్రీ ధార్మిక రామ్​ లీలా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకలకు కాంగ్రెస్​ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. రావణ దహనం చేశారు.

పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌, మొహాలీ, జలంధర్‌, అమృత్‌సర్‌, లుథియానా, పటియాలా, హరియాణాలోని పంచ్‌కుల, అంబాలా, కర్నాల్‌, పానీపట్‌, రోహ్‌తక్‌, బివానీ, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌లో రావణుడు, అతని కుమారుడు మేఘానాథుడు, సోదరుడు కుంభకర్ణ దిష్టిబొమ్మలను దహనం చేశారు. హోషియార్‌పుర్‌లో జరిగిన దసరా వేడుకల్లో సీఎం భగవంత్‌ మాన్‌ పాల్గొన్నారు. బిహార్‌ రాజధాని పట్నాలోనూ విజయదశమి వేడుకలు ఆనందోత్సవాల మధ్య ముగిశాయి. వేడుకల చివరి రోజు గాంధీ మైదానంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. రామలక్ష్మణ పాత్రధారులు.. బాణం సంధించి పది తలల రావణుడి దిష్టి బొమ్మను దహనం చేశారు

Last Updated : Oct 24, 2023, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details