తెలంగాణ

telangana

చరిత్ర సృష్టించిన ఆదివాసీ మహిళ.. భారత రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం

By

Published : Jul 25, 2022, 10:19 AM IST

Updated : Jul 25, 2022, 11:55 AM IST

Murmu President of India: భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపదీ ముర్ము. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పార్లమెంటు సెంట్రల్​ హాల్​లో ఘనంగా జరిగింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ దంపతులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Droupadi Murmu Takes oath as 15th President of India
Droupadi Murmu Takes oath as 15th President of India

భారత రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం

Murmu President of India: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల సీఎంలు, పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము సెంట్రల్‌ హాలుకు చేరుకున్నారు. జస్టిస్‌ ఎన్​వీ రమణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది. ప్రమాణ స్వీకారానికి ముందు ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత దిల్లీలోని రాజ్​ఘాట్​ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం.. రాష్ట్రపతి భవన్​కు వెళ్లగా.. రామ్​నాథ్​ కోవింద్​ దంపతులు ముర్ముకు అభినందనలు తెలిపారు.

రాజ్​ఘాట్​ వద్ద మహాత్ముడికి ముర్ము నివాళి

రాష్ట్రపతిగా తన ఎన్నిక కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక అని అన్నారు ముర్ము. ఈ గెలుపు తన ఒక్కరి ఘనత కాదని.. దేశ ప్రజలందరికీ దక్కిన విజయమని అభిప్రాయపడ్డారు. పేద ప్రజలు కలలు కని.. నిజం చేసుకోగలరనేందుకు తన ఎన్నికే నిదర్శనం అని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి ప్రసంగించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

''దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా. భారత్​ 'ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​' ఉత్సవాలు జరుపుకుంటోంది. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. 50 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 75 ఏళ్ల ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. ఒడిశాలోని చిన్న ఆదివాసీ గ్రామం నుంచి వచ్చి.. అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా.'' అని అన్నారు ద్రౌపది.

ప్రసంగం తర్వాత రాష్ట్రపతి భవన్​కు వెళ్లారు ద్రౌపదీ ముర్ము. అక్కడ రాష్ట్రపతిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో రామ్​నాథ్​ కోవింద్​.. ముర్ము వెంటే ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అధికారిక ట్విట్టర్​ ఖాతాను ముర్ముకు బదిలీ చేశారు.

రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ముర్ము
రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్​ ఖాతా

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ ఆధిక్యంతో గెలుపొందిన ముర్ము.. రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళా రాష్ట్రపతిగా, తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. 64 ఏళ్ల ద్రౌపదికి.. గతంలో ఒడిశా మంత్రిగా, ఝార్ఖండ్​ గవర్నర్​గా సేవలు అందించిన అనుభవం ఉంది.

ముర్ము

తెలుగు వ్యక్తిగా అరుదైన గౌరవం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్​వీ రమణ అరుదైన ఘనత దక్కింది. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన తొలి తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ రమణ ఖ్యాతి గడించారు. సాధారణంగా రాష్ట్రపతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్‌ రమణ.. ఆ గౌరవం దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు వ్యక్తి భారత రాష్ట్రపతితో ప్రమాణం చేయించలేదు.

వరుసగా 10 మంది జులై 25నే..
రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణ స్వీకారం చేసిన 10వ వ్యక్తి ద్రౌపదీ ముర్ము. 1977లో నీలం సంజీవ రెడ్డి జులై 25న భారత ఆరో రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణం చేశారు. అప్పటి నుంచి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించినవారంతా అదే తేదీన బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పుడు 15వ రాష్ట్రపతి ముర్ము కూడా అదే జాబితాలో చేరారు.

జులై 25న ప్రమాణస్వీకారం చేసిన భారత రాష్ట్రపతులు

ఇవీ చూడండి:రాష్ట్రపతులందరి ప్రమాణ స్వీకారం జులై 25నే.. ఎందుకో తెలుసా?

'యుద్ధం ఏదైనా విజయం మనదే.. అది పాక్​కు కూడా తెలుసు'

Last Updated : Jul 25, 2022, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details