తెలంగాణ

telangana

శునకం విశ్వాసం.. యజమానిపై కాల్పులకు ఎదురెళ్లి.. బుల్లెట్ గాయంతో..

By

Published : Jun 6, 2022, 11:55 AM IST

dog dies while trying to save the owner
up latest news

యజమాని ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టింది ఓ శునకం. యజమానిపై జరిపిన తుపాకీ కాల్పులకు అడ్డుగా నిలిచింది. ఈ క్రమంలో యజమానిని రక్షించి.. ఊపిరి వదిలింది.

విశ్వాసానికి మారు పేరు.. శునకాలు. ఈ కారణంతోనే మానవులకు వాటితో విడదీయరాని బంధం ఏర్పడింది. కాలంతో పాటు తమ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాయి శునకాలు. అలాంటి ఘటనే ఉత్తర్​ప్రదేశ్​లోని సుల్తానాపుర్​లో జరిగింది. యజమానిపై జరిపిన తుపాకీ కాల్పులను అడ్డుకునేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు దూకేసింది ఓ శునకం. అనంతరం బుల్లెట్​ గాయానికి మరణించింది.

గాయంతో శునకం విలవిల

ఇదీ జరిగింది:సుల్తానాపుర్​లోని వికవాజిత్​పుర్​లో ఈ ఘటన జరిగింది. విశాల్ శ్రీవాస్తవ అలియాస్ శని అనే వ్యక్తి.. గ్రామంలో కొన్నేళ్లుగా గోశాల నడిపిస్తున్నారు. ఆదివారం రోజున.. గోశాల ప్రాంగణంలోనే గడ్డి ఉంచడానికి ఓ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న రాంబరన్ పీజీ కాలేజ్​ మేనేజర్​ అనిల్​ వర్మ.. తన డ్రైవర్​తో వచ్చి ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అనిల్​ వర్మ.. తన లైసెన్స్​డ్​ తుపాకీతో విశాల్​పైకి కాల్పులు జరిపాడు.

శునకానికి చికిత్స చేస్తూ..

ఈ సమయంలో విశాల్ పెంపుడు శునకం 'మ్యాక్స్​' అక్కడే ఉంది. యజమానిపైకి కాల్పులు జరగడాన్ని పసిగట్టిన మ్యాక్స్​.. ముందుకు దూకింది. దీంతో బుల్లెట్ గాయం దానికే అయ్యింది. అనంతరం అనిల్ వర్మ అక్కడి నుంచి పారిపోగా.. శునకాన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడే కొన్ని గంటల తర్వాత శునకం చనిపోయింది. చికిత్సలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు మేనేజర్​పై కేసు నమోదైంది. పోర్టుమార్టం నివేదిక అనంతరం అతడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:వీధి కుక్కకు ఇన్​స్టా అకౌంట్​.. యూనివర్సిటీలో ధూమ్​ధామ్​గా బర్త్​డే వేడుకలు

ABOUT THE AUTHOR

...view details