తెలంగాణ

telangana

'మా సహనాన్ని పరీక్షించొద్దు.. చర్చలు జరపండి'

By

Published : May 20, 2021, 7:12 AM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు.. తమ సహనాన్ని పరీక్షించొద్దని కేంద్రాన్ని బుధవారం హెచ్చరించారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

famers protest
రైతు సంఘాలు

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆరు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు బుధవారం కేంద్రాన్ని హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని పేర్కొన్నారు. తక్షణమే చర్చలు ప్రారంభించాలని డిమాండ్​ చేశారు.

"ఇప్పటికే రైతు ఉద్యమంలో 470 మందికి పైగా అమరులయ్యారు. చాలా మంది ఆందోళనకారులు తమ ఉద్యోగాలు, చదువులు, ఇతర వ్యాపకాలు వదిలేసి వచ్చారు. ప్రభుత్వం మాత్రం తన పౌరులపై, అన్నదాతలపై క్రూరంగా, అమానవీయంగా ప్రవర్తిస్తోంది. నిజంగా రైతులు, వారి సంక్షేమంపై ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే వెంటనే చర్చలు ప్రారంభించాలి. రైతుల డిమాండ్లను అంగీకరించాలి" అని సంయుక్త కిసాన్​ మోర్చా ఒక ప్రకటనలో తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details