తెలంగాణ

telangana

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

By

Published : Jan 19, 2022, 1:22 PM IST

Flight Ban India: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఉన్న నిషేధాన్ని మరోమారు పొడిగించింది డీజీసీఏ. 2022 ఫిబ్రవరి 28 వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్​తో పాటు కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొంది.

FLIGHTS SUSPENSION
విమానాలపై నిషేధం పొడిగింపు

Flight Ban India: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం 2022 ఫిబ్రవరి 28 వరకు కొనసాగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసులతో పాటు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించొద్దని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. అయితే తాజాగా దీనిని వచ్చే ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

కరోనా విజృంభణ కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను భారత్​ నిలిపేసింది. అయితే.. 2020 మే నుంచి వందే భారత్ మిషన్ కింద, 2020 జులై నుంచి ఎంపిక చేసిన దేశాల నుంచి ద్వైపాక్షిక అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తోంది.

Flight Ban Extended

అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్‌ సహా దాదాపు 40 దేశాల నుంచి ప్రత్యేక బయో బబుల్ ఏర్పాటు ప్రాతిపదికన విమానాలను నడిపేందుకు సంస్థలకు అనుమతినిచ్చింది. కార్గో సర్వీసులపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details