తెలంగాణ

telangana

నదిలో ఖరీదైన 'బీఎండబ్ల్యూ' కారు.. కారణం తెలిసి పోలీసులు షాక్​

By

Published : May 27, 2022, 7:11 PM IST

BMW Car Cauvery River: కర్ణాటక మండ్య జిల్లా వద్ద కావేరీ నదిలో విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారు బయటపడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అదెలా వచ్చిందో తెలిసి షాకయ్యారు. అసలేం జరిగిందంటే?

Depressed man sinks BMW car in Cauvery river at karnataka
Depressed man sinks BMW car in Cauvery river at karnataka

BMW Car Cauvery River: కర్ణాటక మండ్య జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. శ్రీరంగపట్నం నిమిషాంబ ఆలయం సమీపంలోని కావేరీ నదిలో విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారు లభ్యమైంది. గురువారం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వాహనాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. బెంగళూరు మహాలక్ష్మీ లేఅవుట్​ ప్రాంతంలో నివసించే రూపేశ్​కు చెందిన కారుగా గుర్తించారు. అతడే డిప్రెషన్​కు లోనై కారును నదిలో పడేసినట్లు తెలుసుకొని షాకయ్యారు.

కావేరీ నదిలో బీఎండబ్ల్యూ కారు
పోలీసుల వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం రూపేశ్​ తల్లి చనిపోయారు. అప్పటినుంచి అతడి మానసిక పరిస్థితి బాగోలేదు. తీవ్ర కుంగుబాటుకు గురైన రూపేశ్​.. మే 25న తన బీఎండబ్ల్యూ కారును కావేరీ నదిలో పడేశాడు.

ABOUT THE AUTHOR

...view details