తెలంగాణ

telangana

Delhi Night curfew: ఒమిక్రాన్​ ఎఫెక్ట్​- దిల్లీలో రాత్రి కర్ఫ్యూ

By

Published : Dec 26, 2021, 8:05 PM IST

Updated : Dec 26, 2021, 8:17 PM IST

Delhi Night curfew: డిసెంబర్​ 27 నుంచి రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Delhi Night curfew
రాత్రి కర్ఫ్యా

Delhi Night curfew: దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27 నుంచి రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 11.00 నుంచి ఉదయం 5.00 వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

దిల్లీలో ఆదివారం 290 కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ 10 నుంచి ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు 0.55 శాతం పెరిగింది. దిల్లీలో ఇప్పటివరకు 14,43,352 కేసులు వెలుగుచూశాయి. 25,105 మరణాలు నమోదయ్యాయి.

Last Updated : Dec 26, 2021, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details