తెలంగాణ

telangana

కూతురిని కొట్టి చంపిన తల్లిదండ్రులకు జీవిత ఖైదు

By

Published : Jan 16, 2022, 5:12 PM IST

Daughter death Life sentence
Daughter death Life sentence

Daughter death Life sentence: కూతురిని కొట్టి చంపిన తండ్రి, సవతి తల్లికి.. ఓ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దోషులిద్దరూ రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు, రాజస్థాన్ ఝాలావాడ్​ జిల్లాలో కూతురిపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ తండ్రి.

Daughter death Life sentence: ఉత్తర్​ప్రదేశ్​లోని కైరానా కోర్టు ఓ బాలిక తల్లిదండ్రులకు జీవిత ఖైదు విధించింది. తమ కూతురిని కొట్టి చంపినందుకు శిక్షగా ఈ తీర్పు వెలువరించింది. దోషులిద్దరూ రూ.10 వేల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది. జరిమానా కట్టకపోతే.. అదనంగా ఏడాది జైలులో ఉండాలని స్పష్టం చేసింది.

UP Girl beaten to death

ప్రభుత్వ న్యాయవాది అశోక్ పంధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. షామిమా అనే అమ్మాయిని ఆమె సవతి తల్లి సితారా బేగం, తండ్రి షోకీన్​ కలిసి హత్య చేశారు. 2018లో షామ్లి జిల్లాలోని హాట్చోయా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతురాలి సోదరుడు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కైరానా ఫాస్ట్​ట్రాక్ కోర్టు ఈ కేసు విచారణ చేపట్టి.. నిందితులకు శిక్ష విధించింది.

Father molestation Daughter

రాజస్థాన్ ఝాలావాడ్ జిల్లాలో కూతురిని లైంగికంగా వేధించిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై బాధితురాలి తల్లే ఈ-సంపర్క్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసింది. అనంతరం స్పందించిన పోలీసులు.. చర్యలు చేపట్టారు.

'11 ఏళ్ల తన కూతురిపై భర్త వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేశారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో తన కూతురిపై వేధింపులకు పాల్పడ్డాడని చెప్పారు. గురువారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు ఈ ఘటన జరిగిందని తెలిపారు. నిందితుడిపై పోక్సో, సీఆర్​పీసీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నాం. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. అనంతరం బెయిల్​పై విడుదలయ్యాడు' అని స్టేషన్ హౌస్ అధికారి రామ్​నారాయణ్​ వెల్లడించారు. నిందితుడు మద్యానికి బానిస అయ్యాడని వెల్లడించారు. ఈ కేసులో బాలిక స్టేట్​మెంట్​ను వీడియో రికార్డు చేస్తున్నట్లు తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు స్టేట్​మెంట్ రికార్డు చేయాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:'కార్​ రాజా'.. ఏడాదిలో 100 కార్లను కొట్టేసిన ఘరానా దొంగ

ABOUT THE AUTHOR

...view details