తెలంగాణ

telangana

Minor Dalit Girl Raped: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేసి.. మద్యం తాగించి..

By

Published : Jun 20, 2023, 10:52 AM IST

Dalit Girl Raped: పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పాడు. దళిత విద్యార్థిని అయిన ఆ బాలికను నమ్మించి బయటకు తీసుకొనివెళ్లాడు. అదును చూసుకొని ఆమెపై అత్యాచారం చేశాడు. అంతే కాకుండా ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. తరువాత ఆ విద్యార్థినిని హాస్టల్ వద్ద విడిచిపెట్టేశాడు.

Minor Dalit Girl Raped
మైనర్ దళిత బాలికపై అత్యాచారం

Minor Dalit Student Raped in Machilipatnam: పెళ్లి చేసుకుంటానని నమ్మించి డిగ్రీ చదువుతున్న దళిత బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా మద్యం తాగించాడో కామాంధుడు. అధికార పార్టీకి చెందిన నాయకుడి అనుచరుడిగా చెలామణి అవుతున్న సతీష్‌ అనే యువకుడు .. దళిత బాలికపై అత్యాచారం చేయడం స్థానికంగా సంచలనం రేపింది. డిగ్రీ చదువుతున్న విద్యార్ధినిని ప్రలోభపెట్టి తన కోరిక తీర్చుకున్నాడు. అనంతరం మద్యం తాగించి బాలికను హస్టల్​ వద్ద వదిలేశాడు. ఆ హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డిగ్రీ చదువుతున్న యువతిపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు మచిలీపట్నంలోని వసతి గృహంలో ఉంటూ డిగ్రీ చదువుతోంది. ఏడాదిన్నర క్రితం బందరు మండలం ఎస్‌ఎన్‌ గొల్లపాలెం గ్రామానికి చెందిన సతీష్​తో బాలికకు పరిచయం ఏర్పడింది. బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి సతీష్‌ నమ్మించాడు. ఆదివారం మధ్యాహ్నం హాస్టల్‌ నుంచి విద్యార్థినిని సతీష్‌ మచిలీపట్నంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ విద్యార్థినిని ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు.

Swamiji Rape on Girl: కీచక స్వామీజీ.. బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. కాళ్లకు గొలుసులు కట్టి

లాడ్జి నుంచి బాలికను.. ఎస్​ఎన్ గొల్లపాలెం గ్రామంలోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. బాలికను వసతి గృహంలో దింపేందుకు తిరిగి మచిలీపట్నం వస్తున్న తరుణంలో మార్గ మధ్యలో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి స్నేహితుడితో కలసి మద్యం తాగాడు. బాలికతో కూడా బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత రాత్రికి తిరిగి హాస్టల్‌కు తీసుకొచ్చి బాలికను అక్కడ వదిలేశారు.

హాస్టల్ వార్డెన్‌ విద్యార్థినుల హాజరు పరిశీలిస్తుండగా ఈ బాలిక ఇంకా రాలేదని తెలియడంతో.. బాలికకు ఫోన్‌ చేశారు. బాలిక నుంచి స్పందన లేకపోవడంతో విద్యార్ధిని తల్లిదండ్రులకు వార్డెన్ సమాచారం ఇచ్చారు. అదే విధంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో బాలిక వచ్చిందన్న సమాచారం రావడంతో వార్డెన్ వసతి గృహానికి తిరిగి చేరుకున్నారు. అప్పటికే విద్యార్థిని మద్యం మత్తులో ఉండటంతో బాలికను వార్డెన్‌ హుటాహుటిన ప్రభుత్వాసుత్రికి తరలించారు.

Gay Murder Case: గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యి.. ప్రాణం తీశాడు

విద్యార్థినిని వైద్యులు పరీక్షించి మద్యం కారణంగా మత్తులో ఉందని తెలిపారు. సోమవారం ఉదయానికి గాని పూర్తి స్పృహలోకి రాలేదు. బాలిక తల్లి, బంధువులను పిలిపించి బాలిక స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. బాలిక స్టేట్‌మెంట్‌ ఆధారంగా మచిలీపట్నం రాబర్ట్‌సన్‌పేట పోలీసులు నిందితుడు సతీష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు కట్టారు. సెక్షన్‌ 376, మైనర్‌ కావడంతో పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అదే విధంగా సతీష్​తో పాటు అతడి స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details