తెలంగాణ

telangana

సిలిండర్​ పేలి ఇద్దరు చిన్నారులు మృతి.. ఇల్లు కూలి మరో ఇద్దరు యువకులు..

By

Published : Feb 12, 2023, 1:39 PM IST

సిలిండర్​ పేలి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు మహారాష్ట్రలో ఇల్లు కూలిపోయి ఇద్దరు యువకులు మృతి చెందారు.

cylinder-exploded-in-house-severel-died-and-injured-in-uttar-pradesh
Etv ఉత్తర్​ప్రదేశ్​లో ఇంట్లో పేలిన సిలిండర్​

ఇంట్లో సిలిండర్​ పేలి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మృతుల్లో 12 రోజుల చిన్నారి సహా 12 సంవత్సరాల వయసున్న బాలుడు ఉన్నాడు. ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నోయిడాలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

గాఢనిద్రలో ఉండగానే ఘటన..
కుటుంబమంతా గాఢనిద్రలో ఉండగానే ఈ ఘటన జరిగింది. దాదాపు 2.52 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఇంట్లో మంటలు చెలరేగడాన్ని గమనించిన.. పరిసర ప్రాంత ప్రజలు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే ఇంట్లోని వారంతా తీవ్రంగా గాయపడ్డారు.

"ఓ ఇంట్లో ఎల్​పీజీ సిలిండర్​ పేలినట్లు మాకు సమాచారం అందింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటన స్థలానికి వెళ్లాం. కేవలం నాలుగు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాం. ఘటన స్థలానికి ఫైర్​ స్టేషన్​కు రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంది. మేము చేరుకునే సరికి కుటుంబ సభ్యులంతా మంటల్లోనే ఉన్నారు. అందులో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు" అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ చౌబె తెలిపారు. దాదాపు 20 నిమిషాల పాటు మంటలు చెలరేగినట్లు ఆయన వెల్లడించారు.

ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. వారి పరిస్థితి మరింత విషమించిన కారణంగా దిల్లీలోని మరో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇల్లు కూలి ఇద్దరు మృతి..
మహారాష్ట్రలో ఓ ఇల్లు కూలిపోయింది. ఇంటికి మరమ్మత్తులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఇంట్లోనే ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ముంబయి, భాండుప్ వెస్ట్​లోని ఖిండిపాడు ప్రాంతంలో ఈ విషాదం జరిగింది. మృతులను 19 సంవత్సరాల రాజ్‌కుమార్ ధోత్రే, 18 సంవత్సరాల రామనంద్​ యాదవ్​గా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details