తెలంగాణ

telangana

బంగాల్‌కు కొత్త గవర్నర్‌ నియామకం..

By

Published : Nov 17, 2022, 9:52 PM IST

CV  ananda bose appontied as west bengal governor
పశ్చిమ బెంగాల్‌కు నూతన గవర్నర్‌ నియామకం

బంగాల్​కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. నూతన గవర్నర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి డా.సి.వి.ఆనంద బోస్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

బంగాల్​కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. నూతన గవర్నర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి డా.సి.వి.ఆనంద బోస్‌ను నియమిస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సి.వి.ఆనంద బోస్‌ బంగాల్​కు రెగ్యులర్‌ గవర్నర్‌గా కొనసాగుతారని పేర్కొన్నారు.

గతంలో పశ్చిమ్ బంగ గవర్నర్‌గా పనిచేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో మణిపూర్‌ గవర్నర్‌ లా గణేషన్‌ అయ్యర్‌కు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో జులై నుంచి ఆయనే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా బంగాల్‌కు పూర్తికాలం గవర్నర్‌గా డా.సి.వి.ఆనంద బోస్‌ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కేరళకు చెందిన ఆనంద బోస్‌ గతంలో ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం మేఘాలయ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్నారు.

ఇదీ చూడండి :ఒంటి కాలితో 2లక్షల కి.మీ సైక్లింగ్.. క్యాన్సర్​ను, వైకల్యాన్ని ఎదిరించిన రాజు

ABOUT THE AUTHOR

...view details