తెలంగాణ

telangana

నగరంలో మెట్రో రైలు పనులు.. ఇళ్లల్లో పగుళ్లు.. జనం పరుగో పరుగు!

By

Published : Oct 14, 2022, 10:15 AM IST

కోల్​కతాలో జరుగుతున్న మెట్రో రైలు పనుల కారణంగా ఇళ్లల్లో భారీగా పగళ్లు ఏర్పడాయి. భయాందోళనకు గురైన స్థానికులు రోడ్లు మీదకు పరుగులు తీశారు.

Kolkata: Residents flee as 10 buildings developed crack allegedly due to Metro Rail work
Kolkata: Residents flee as 10 buildings developed crack allegedly due to Metro Rail work

Kolkata Metro Works : బంగాల్​లోని కోల్​కతాలోని మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. బౌబజార్​ ప్రాంతంలో ఉన్న పది ఇళ్లల్లో శుక్రవారం ఉదయం భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన నివాసితులు.. ప్రాణభయంతో సామాన్లు తీసుకుని బయటకు పరుగులు తీశారు. అయితే తమ కష్టాలకు అధికారులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రోడ్ల మీద ప్రజలు

సమాచారం తెలుసుకున్న పోలీసు బలగాలు.. పెద్ద ఎత్తున ఘటనాస్థలిలో మోహరించాయి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అక్కడకు చేరుకున్నారు. 2019లో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. అనేక భవనాల్లో పగుళ్లు ఏర్పడడం వల్ల తమ ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు స్థానికులు.

ABOUT THE AUTHOR

...view details