తెలంగాణ

telangana

దేశంలో మరో 529 మందికి కరోనా- జేఎన్​.1 కేసులు @ 109

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 3:24 PM IST

Updated : Dec 27, 2023, 4:59 PM IST

Covid Cases And New Variant Cases In India Today
Covid Cases And New Variant Cases In India Today

Covid Cases In India Today : దేశంలో కొత్తగా 529 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో యాక్టివ్​ కేసులు 4,093కు చేరుకున్నట్లు చెప్పింది. మరోవైపు కొవిడ్​ కొత్త ఉపరకం జేఎన్​.1 వైరస్​ కేసులు మంగళవారం నాటికి 109కి చేరుకున్నాయి.

Covid Cases In India Today : దేశంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 529 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్​లో కరోనా యాక్టివ్​ కేసుల సంఖ్య 4,093కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. వైరస్​ బారిన పడి మంగళవారం ముగ్గురు చనిపోయారని అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు కర్ణాటక వాసి కాగా మరొకరు గుజరాత్​కు చెందినవారని చెప్పారు.

భారత్​లో విజృంభిస్తున్న జేఎన్​.1 వేరియెంట్
Covid New Variant Cases In India : మంగళవారం (డిసెంబర్​ 26) వరకు భారత దేశంలో మొత్తం 109 కొవిడ్​ ఉపరకం జేఎన్​.1 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో గుజరాత్​ నుంచి 36, కర్ణాటక- 34, గోవా- 14, మహారాష్ట్ర- 9, కేరళ- 6, రాజస్థాన్​- 4, తమిళనాడు- 4, తెలంగాణ నుంచి 2 కేసులు ఉన్నట్లు తెలిపింది.

మరోవైపు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

బయటకు వస్తే మాస్క్ తప్పనిసరి
నిత్యం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్​ చేస్తోంది. కొవిడ్​కు సంబంధించి ఇప్పటికే పలు కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్​ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్​ వేసుకోవాలని కోరింది. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పాటించడం, పరిశుభ్రత విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయాలని సిఫార్సు చేసింది కేంద్ర వైద్యారోగ్య శాఖ.

14రాష్ట్రాలు, 6200 కి.మీ- రాహుల్​ 'భారత్ న్యాయ్ యాత్ర'- ఎప్పటినుంచంటే?

ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద పేలుడు- రంగంలోకి NIA, NSG- ఆ 'లెటర్' స్వాధీనం!

Last Updated :Dec 27, 2023, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details