తెలంగాణ

telangana

పక్షుల కోసమే ప్రత్యేకంగా చెట్ల పెంపకం- దంపతుల ఔదార్యం

By

Published : Oct 30, 2021, 12:48 PM IST

Updated : Oct 30, 2021, 5:05 PM IST

కర్ణాటకకు చెందిన దంపతులు పక్షుల సంరక్షణకు తమ జీవితాన్ని అంకితం చేశారు. పక్షులు నివాసం ఉండేందుకు ప్రత్యేకంగా రెండెకరాల్లో చెట్లను పెంచుతున్నారు. వాటికి కావాల్సిన నీరు, ఆహారం అందిస్తున్నారు. పక్షుల సంరక్షణపై ఇతరులకూ అవగాహన కల్పిస్తున్నారు.

This couple from Karnataka provides safe place for birds
పక్షుల కోసమే ప్రత్యేకంగా చెట్ల పెంపకం

పక్షుల కోసమే ప్రత్యేకంగా చెట్ల పెంపకం

కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో (Dakshina Kannada news) ప్రకృతి పట్ల ప్రేమను చాటుకుంటోంది ఓ జంట. పక్షుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసింది. పక్షుల కోసమే ప్రత్యేకంగా చెట్లను పెంచుతోంది.

జిల్లాలోని ఎలియనడుగు (Dakshina Kannada news)గ్రామంలో నిత్యానంద శెట్టి, రమ్య నిత్యానంద శెట్టి.. నివాసం ఉంటున్నారు. పక్షుల కోసమే ప్రత్యేకంగా వీరు చెట్లను పెంచుతున్నారు. పండ్ల చెట్లతో పాటు పక్షుల నివాసానికి అనువుగా ఉండే వృక్షాలను సంరక్షిస్తున్నారు. పక్షుల దాహార్థిని తీర్చడానికి మట్టి పాత్రల్లో నీటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరు చేస్తున్న కృషి వల్ల ఈ ప్రాంతం (Karnataka news) పక్షుల కిలకిలారావాలతో అలరారుతోంది.

మట్టిపాత్రలో నీళ్లు
.
.

"మనం మన చుట్టూ ఉన్న పక్షులను కాపాడాలి. వాటి కోసం కొద్దిగా స్థలాన్ని కేటాయించాలి. వేసవి కాలంలో నీరు దొరకక పక్షులు వలస వెళ్తుంటాయి. అలా జరగకుండా కాపాడేందుకే మేం ఈ స్థలాన్ని ఉపయోగించి పక్షులను సంరక్షిస్తున్నాం. మొక్కలను విరివిగా పెంచుతున్నాం. ఈ పని చేయడం మాకు చాలా సంతోషాన్నిస్తుంది."

-నిత్యానంద శెట్టి, ప్రకృతి ప్రేమికుడు

పక్షులను స్వయంగా పరిరక్షించడమే (Bird Conservation in India) కాకుండా.. ఇతరులు కూడా తమ దారిలో నడిచేలా అవగాహన కల్పిస్తోంది ఈ జంట. ఇందుకోసం 'స్పారో నెస్ట్ అవేర్​నెస్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. పక్షులు, ముఖ్యంగా పిచ్చుకల సంరక్షణపై పాఠశాల విద్యార్థులు, వయోజనులకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రతి పాఠశాలకు వెళ్లి ప్రచారం చేస్తోంది.

పక్షుల కోసం ఏర్పాటు చేసిన మట్టి పాత్రలు
పక్షి గూడు
పండ్లను ఆరగిస్తున్న పక్షి

'పక్షుల సంరక్షణ మన బాధ్యత. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటివరకు 205 పాఠశాలలకు వెళ్లాం. పక్షుల సంరక్షణ గురించి మాకు తెలిసిన సమాచారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం' అంటూ రమా నిత్యానంద శెట్టి చెప్పుకొచ్చారు. ఈ దంపతులు చేస్తున్న ప్రకృతి సేవను పలువురు ప్రశంసిస్తున్నారు.

సైకిల్​పై పక్షులను పరిరక్షించాలనే సందేశం

ఇదీ చదవండి:స్వచ్ఛత కోసం నిరంతర సమరం- 'ఆరుబయలు'కు మంగళం

Last Updated : Oct 30, 2021, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details