తెలంగాణ

telangana

దేశంలో తగ్గిన కొవిడ్ వ్యాప్తి.. 15వేల దిగువకు యాక్టివ్​ కేసులు

By

Published : Mar 30, 2022, 9:22 AM IST

Covid Cases: దేశంలో కరోనా కేసులు సంఖ్య తగ్గుతూ వస్తోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా 1,233 మంది వైరస్ బారినపడ్డారు. మరో 31 మంది వైరస్​ కారణంగా మరణించారు.

corona cases in india
కరోనా కేసులు

Corona New Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ ఉండటం ఊరటనిస్తోంది. కొత్తగా 1,233 మందికి వైరస్​ సోకింది. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,876 మంది వైరస్​ను జయించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.20శాతంగా ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం మరో 26,34,080 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,82,41,743కు పెరిగింది.

  • మొత్తం కేసులు:4,30,23,215
  • మొత్తం మరణాలు:5,21,101
  • యాక్టివ్​ కేసులు:14,704
  • కోలుకున్నవారు:4,24,87,410

ప్రపంచవ్యాప్తంగా కేసులు:ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం అన్ని దేశాల్లో కలిపి 15,49,803 కొత్త కేసులు వెలుగు చూశాయి. 4,026 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48,50,29,778కు చేరగా.. మృతుల సంఖ్య 61,56,469కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అత్యధికం ఉన్న దేశాల జాబితాలో దక్షిణకొరియా టాప్​లో ఉంది. మిగతా దేశాల పరిస్థితి ఇలా ఉంది..

దేశం కొత్త కేసులు కొత్త మరణాలు మొత్తం కేసులు మొత్తం మరణాలు
1 దక్షిణ కొరియా 3,47,374 237 1,23,50,428 15,423
2 వియత్నాం 88,378 88 93,86,489 42,413
3 జర్మనీ 2,37,858 331 2,07,02,930 1,29,437
4 ఫ్రాన్స్​ 2,17,480 164 2,52,76,508 1,41,985
5 ఇటలీ 99,457 177 14,496,579 1,59,054

ABOUT THE AUTHOR

...view details