తెలంగాణ

telangana

దేశంలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. మరణాలు

By

Published : Mar 10, 2022, 9:11 AM IST

Corona cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఒక్కరోజే 4,184 మంది కొవిడ్​ బారినపడ్డారు. వైరస్​ ధాటికి మరో 100 మందికిపైగా మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.

Corona cases in India
Corona cases in India

Corona cases in India: దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 4,184 కేసులు బయటపడగా.. మరో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,554 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు మెరుగుపడి 98.70 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.10 శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.20 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు:4,29,80,067
  • మొత్తం మరణాలు:5,15,459
  • యాక్టివ్​ కేసులు:44,488
  • కోలుకున్నవారు:4,24,20,120

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. బుధవారం మరో 18,23,329 డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,79,53,95,649కి చేరింది.

World Corona cases

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. తాజాగా 16,96,842 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 45 కోట్లు దాటింది. మరో 6,708 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 60 లక్షలు దాటింది.

  • జర్మనీలో కొత్తగా 1,91,973 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 216 మంది మృతి చెందారు.
  • అమెరికాలో తాజాగా 39,200 మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 1,265 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కొత్తగా 58,675 కరోనా కేసులు బయటపడ్డాయి. 645 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 49,078 మందికి వైరస్​ సోకగా.. 652 మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చూడండి:చెత్త కుప్పలో ఐదు పిండాలు, మానవ శరీర భాగాలు..

ABOUT THE AUTHOR

...view details