తెలంగాణ

telangana

కేరళలో కరోనా ఉద్ధృతి .. ఒక్కరోజే 50వేల కేసులు

By

Published : Jan 26, 2022, 8:58 PM IST

Corona cases in India: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేరళలో మరో 50వేల మందికి వైరస్​ సోకింది. కర్ణాటకలో క్రితం రోజుతో పోలిస్తే 7వేలు అధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. అటు దిల్లీలోనూ వైరస్​ క్రమంగా విజృంభిస్తోంది.

India corona cases
కరోనా కేసులు

Corona cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేరళలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 49,771 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57.74 లక్షలు దాటింది. మరో 140 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 52,281కి చేరింది. అయితే.. మంగళవారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి.

కర్ణాటకలో భారీగా పెరిగిన కొత్త కేసులు..

కర్ణాటకలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. బుధవారం మరో 48,905 మందికి వైరస్​ సోకింది. 39 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 36.54లక్షలు, మరణాలు 38,705కు చేరాయి. మంగళవారం(41,400)తో పోలిస్తే బుధవారం కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. కొత్త కేసుల్లో ఒక్క బెంగళూరులోనే 22,427 ఉండటం గమనార్హం.

దిల్లీలో పెరిగిన కొత్త కేసులు..

దేశ రాజధాని దిల్లీలో కొత్త కేసులు భారీగా పెరిగాయి. బుధవారం కొత్తగా 7,498 మందికి వైరస్​ సోకింది. మంగళవారం(6,028)తో పోలిస్తే.. 1470 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 10.59 శాతానికి చేరుకుంది. బుధవారం మరో 29 మంది వైరస్​కు బలయ్యారు.

రాష్ట్రం కొత్త కేసులు మరణాలు
గుజరాత్​ 14,781 21
ఆంధ్రప్రదేశ్​ 13,618 -
ఒడిశా 7,416 10
జమ్ముకశ్మీర్ 5,606 8
తెలంగాణ 3,801 1
పుదుచ్చేరి 1,504 3
మధ్యప్రదేశ్ 9,966 8

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:దేశంలో పెరిగిన కరోనా ఉద్ధృతి.. 4 కోట్లు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details