తెలంగాణ

telangana

భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 11వేల 499 నమోదు

By

Published : Feb 26, 2022, 9:32 AM IST

Corona cases: దేశంలో కొత్తగా 11,499 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 255 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 1.01 శాతానికి పరిమితమైంది.

corona cases in india today
coronavirus

Corona cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య శనివారం భారీగా తగ్గింది . కొత్తగా 11,499 కేసులు నమోదయ్యాయి. 23,598మంది కోలుకున్నారు. మరో 255 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.01శాతానికి పరిమితమైంది.

  • మొత్తం మరణాలు: 5,13,481
  • యాక్టివ్​ కేసులు: 1,21,881
  • కోలుకున్నవారు: 4,22,70,482

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య 1,77,17,68,379కి చేరింది.

World Corona cases:

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గినా.. కరోనా వ్యాప్తి మాత్రం ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 16,10,287 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 43,32,97,210 మరణాలు.. 59,56,325కు చేరుకున్నాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • జర్మనీలో కొత్తగా 1,93,099 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 235 మంది కరోనాకు బలయ్యారు.
  • రష్యాలో తాజాగా 1,23,460 కరోనా కేసులు నమోదయ్యాయి. 787 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 781 మంది చనిపోయారు. కొత్తగా 90,199 కేసులు వెలుగుచూశాయి.
  • దక్షిణ కొరియాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,65,889 మందికి వైరస్​ సోకింది. 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కరోనా మహమ్మారి ధాటికి మరో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 58,138 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి:'కొవిడ్​ ఆంక్షలు సడలించండి'- రాష్ట్రాలకు కేంద్రం సూచన

ABOUT THE AUTHOR

...view details