తెలంగాణ

telangana

పార్టీ చాలా చేసింది.. రుణం తీర్చుకునే సమయమిదే: సోనియా

By

Published : May 9, 2022, 7:49 PM IST

Congress Chintan Shivir

Sonia Gandhi: కాంగ్రెస్ బలోపేతానికి ఉద్దేశించిన చింతన్ శివిర్ కార్యక్రమం ఏర్పాట్లపై దిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశమైంది. ఈ భేటీకి అధ్యక్షత వహించిన పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ.. అగ్ర నేతలకు కీలక సూచనలు చేశారు. పార్టీని వేగంగా బలోపేతం చేయడానికి ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Sonia Gandhi: రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో చింతన్ శివిర్ నిర్వహణకు ముందు పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. పార్టీని వేగవంతంగా బలోపేతం చేయడానికి నేతల సహకారం కోరిన ఆమె.. ఐక్యత, సంకల్పం, నిబద్ధత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అగ్ర నేతలతో నిర్వహించిన సీడబ్ల్యూసీ భేటీకి సోనియా అధ్యక్షత వహించారు. చింతన్ శివిర్ అనేది నామమాత్రంగా మారకూడదని చెప్పారు.

"చింతన్ శివిర్ అనేది ఒక ఆచారంగా మారకూడదు. సైద్ధాంతిక, ఎన్నికల నిర్వాహక సవాళ్లను ఎదుర్కోవడానికి పార్టీని పునర్​ వ్యవస్థీకరించేలా ఉండాలి. నిస్వార్థ పని, క్రమశిక్షణే మన పట్టుదలను తెలియజేస్తాయి. పార్టీ వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరిగింది. ఇప్పుడు ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించే సమయం వచ్చింది. మన పార్టీ వేదికల్లో ఆత్మ విమర్శ చేసుకోవడం అవసరం. అయితే ఆ విమర్శలు ఆత్మవిశ్వాసం, నైతిక స్థైర్యం క్షీణించి, వినాశకరమైన వాతావరణం వ్యాప్తి చెందే విధంగా ఉండకూడదు."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

కాంగ్రెస్ చింతన్ శివిర్ కోసం మే 13, 14, 15 తేదీల్లో ఉదయ్‌పుర్‌లో సమావేశం కాబోతున్నామని సోనియా గాంధీ తెలిపారు. దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు చింతన్ శివిర్​లో పాల్గొంటారని వెల్లడించారు. "చింతన్ శివిర్​లో ఆరు గ్రూపులుగా చర్చలు ఉంటాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత , సంస్థాగత సమస్యలపై చర్చలు ఉంటాయి. ఏ గ్రూప్‌లో పాల్గొనాలనే దాని గురించి ప్రతినిధులకు ఇప్పటికే తెలియజేశాం" అని సోనియా పేర్కొన్నారు.

పార్టీ వేగంతమైన పునరుజ్జీవనానికి ఉదయ్​పుర్ నుంచి స్పష్టమైన సందేశం వెళ్లేలా నేతలు సహకరించాలని సోనియా కోరారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత, స్థితిస్థాపకతను ప్రదర్శించడానికి చింతన్ శివిర్ వీలు కల్పిస్తుందని చెప్పారు.

ఇదీ చూడండి:దేశద్రోహ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీంకు విన్నపం

ABOUT THE AUTHOR

...view details