తెలంగాణ

telangana

వరదలో చిక్కుకున్న తల్లీబిడ్డల కోసం యువకుల సాహసం- సీఎం ఫిదా

By

Published : Oct 26, 2021, 7:21 PM IST

Updated : Oct 26, 2021, 10:31 PM IST

తమిళనాడులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకున్న తల్లీబిడ్డలను స్థానికులు అతికష్టం మీద కాపాడారు. సేలం జిల్లాలోని అనైవరి జలపాతం చూసేందుకు వచ్చిన తల్లీబిడ్డలు ప్రమాదవశాత్తు ప్రవాహం వద్ద చిక్కుకుపోయారు. అది గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో ఇరువురిని పైకి లాగి రక్షించారు. ప్రాణాలను పణంగా పెట్టి గ్రామస్థులు చేసిన సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా వారిపై ప్రశంసలు కురిపించారు.

CM Stalin hails a duo who risked their lives to save mother and Child
తల్లి బిడ్డలను కాపాడిన స్థానికులు.. సీఎం ప్రశంసలు

వరదలో చిక్కుకున్న తల్లీబిడ్డల కోసం యువకుల సాహసం- సీఎం ఫిదా

కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడం, వరుస సెలవులు రావడం వల్ల తమిళనాడు సేలం జిల్లాలోని అనైవారి జలపాతానికి భారీగా పర్యటకులు పోటెత్తారు. ఇలా అక్కడి పచ్చని ప్రకృతి, జలపాత హోయలను చూసేందుకు వచ్చిన ఓ మహిళ తన బిడ్డతోపాటు ప్రవాహంలో చిక్కుకుంది. పర్యటకులు చూస్తుండగానే జలపాతం ఉగ్రరూపం దాల్చింది. అప్పటి వరకు అక్కడ నీటితో ఆడుకుంటున్న జనం పరుగులు పెట్టారు. అటువైపు ఓ బండ రాయిపై కూర్చుని చూస్తున్న ఆ మహిళ అక్కడే ఉండిపోయింది. ఇది గమనించినవారు ఆమెను రక్షించేందుకు పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. స్థానికులు ప్రాణాలకు తెగించి ఆ మహిళను రక్షించేందుకు సిద్ధమయ్యారు. తాళ్ల సాయంతో ఆ ఇద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రయత్నంలో ఓ ఇద్దరు గ్రామస్థులు కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయారు. కానీ, వారు సమీపంలోని ఒడ్డుకు ఈదుకుంటూ రాగా.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వరదలో చిక్కుకున్న తల్లీబిడ్డల కోసం యువకుల సాహసం- సీఎం ఫిదా

ఈ ఘటనతో అధికారులు అనైవారి జలపాతం వద్ద తాత్కాలికంగా నిషేధం విధించారు. తల్లీకూతుళ్లను కాపాడిన వారి సాహసోపేతమైన చర్య అభినందనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ మెచ్చుకున్నారు. ప్రభుత్వం ద్వారా వారిని ప్రత్యేకంగా సత్కరిస్తామని తెలిపారు. విపత్తుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వరదలో చిక్కుకున్న తల్లీబిడ్డల కోసం యువకుల సాహసం- సీఎం ఫిదా

ఇదీ చూడండి:21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారయత్నం

Last Updated :Oct 26, 2021, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details