తెలంగాణ

telangana

సాగర్ వివాదంపై వీడని అనిశ్చితి - తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 9:31 PM IST

Clash between AP and Telangana Police : జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరగనున్న తెలుగు రాష్ట్రాల సమావేశం, ఈ నెల 6కు వాయిదా పడింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో తెలంగాణ అధికారుల విజ్ఞప్తి మేరకు జలశక్తి శాఖ వెసులుబాటు కల్పించింది. కేంద్ర జలశక్తి సంఘం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.ఎన్‌.రావు నాగార్జున సాగర్‌ డ్యాంను సందర్శించారు. అటు కీలక నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల భద్రత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయింది. శుక్రవారం ఏపీ అధికారులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇవాళ తెలంగాణ అధికారులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Clash between AP and Telangana Police
Nagarjuna Sagar Project Issue

సాగర్ వివాదంపై వీడని అనిశ్చితి - తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు

Clash between AP and Telangana Police : కృష్ణా జలాల పంపిణీ, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై జలశక్తిశాఖ నిర్వహించిన సమావేశం డిసెంబర్‌ 6 కు వాయిదాపడింది. తెలంగాణలో ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉన్నందున, అందుకు చేయాల్సిన ఏర్పాట్లపై తెలంగాణ చేసిన అభ్యర్థన మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ను(Video conference) డిసెంబరు 6 కు కేంద్ర జలశక్తి శాఖ మార్చింది. అయితే జలశక్తిశాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు హాజరైన ఏపీ అధికారులు ఏపీకి ఉన్న నీటి అవసరాలు, ప్రాజెక్టుల వద్ద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు.

నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం

శ్రీశైలం నుంచి 15 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఇప్పటికే కేఆర్ఎంబీకి ఇండెంట్ సమర్పించామని ఏపీ వెల్లడించింది.అయితే ఈనెల 4న ఏపీ పంపనున్న ఇండెంట్​పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని జలశక్తిశాఖ(Department of Hydropower) కేఆర్ఎంబీని ఆదేశించింది. అప్పటి వరకు సాగర్ నుంచి నీటి విడుదలను నిలిపేయాలని ఏపీకి జలశక్తి శాఖకు సూచించింది.

High Tension on Nagarjuna Sagar Project :ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. డ్యాం పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించిన వేళ సీఆర్​పీఎఫ్(CRPF) బలగాలు డ్యామ్ పైకి చేరుకున్నాయి. ఈ తెల్లవారుజామున ఐదింటి నుంచే ఒక్కో పాయింట్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి డ్యామ్ పూర్తిగా, కేంద్ర బలగాల అధీనంలోకి వెళ్లింది.

సాగర్ డ్యామ్ ఘటన - తెలంగాణ అభ్యర్థనతో జలశక్తి శాఖ కీలక భేటీ వాయిదా

ఆ తర్వాత 13వ గేటు వద్ద కంచెను తొలగించే అవకాశం ఉంది. సీఆర్​పీఎఫ్ బలగాలు రాగానే అక్కడి నుంచి తెలంగాణ పోలీసులు వెనుదిరిగారు. మరోవైపు సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాలువ ద్వారా ప్రస్తుతం 5 వేల 450 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టును కేఆర్ఎంబీ సభ్యులు అశోక్‌కుమార్, రఘునాథ్ సందర్శించారు. డ్యామ్‌ కుడికాలువ వైపునకు వెళ్లి నీటి విడుదలను పరిశీలించారు.

AP Police Cases Against Telangana Officials : సాగర్ డ్యాం వివాదంపై 2 రాష్ట్రాల పోలీసులు పరస్పరం కేసులు నమోదు చేశారు. ఏపీ పోలీసులు తమపై దాడికి పాల్పడ్డారని ఏపీ నీటిపారుదలశాఖ(Irrigation Department) అధికారులు అనుమతి లేకుండా నీటిని విడుదల చేశారని తెలంగాణ సాగునీటిశాఖ అధికారులు చేసిన ఫిర్యాదుపై శుక్రవారాన తెలంగాణ పోలీసులు కేసు నమోదుచేయగా, ఇప్పుడు సాగర్ డ్యాంపై తమ విధులు విఘాతం కలిగించారని ఏపీ నీటిపారులశాఖ అధికారులు చేసిన ఫిర్యాదుపై ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులపై కేసు నమోదు చేశారు.

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

'నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో యథాతథ స్థితి కొనసాగింపునకు ఇరు రాష్ట్రాల అంగీకారం'

ABOUT THE AUTHOR

...view details