తెలంగాణ

telangana

'ఆ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని మోదీ ఒత్తిడి తెచ్చారు'

By

Published : Nov 7, 2022, 7:34 AM IST

హిమాచల్​ ఎన్నికల్లో ఓ అభ్యర్థిని పోటీ చేయనివ్వకుండా ప్రధాని మోదీ ఎమోషనల్​గా బ్లాక్​ మెయిల్ చేశారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఓ ​వీడియో​ను ఆధారంగా తీసుకుని ఆయన విమర్శించారు.

modi pressures rebel bjp leader
modi pressures rebel bjp leader

హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపాకు చెందిన ఓ తిరుగుబాటు అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒత్తిడి తెచ్చారని ఆదివారం కాంగ్రెస్‌ ఆరోపించింది. తద్వారా ప్రధాని తన అధికారాన్ని ఉపయోగించి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని విమర్శించింది. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న ఓ వీడియోను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి ప్రస్తావించారు. కంగ్రా జిల్లాలోని ఫతేపుర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవద్దంటూ ఓ నేతను మోదీ ఫోనులో మానసికంగా బెదిరిస్తున్నారని తెలిపారు. ‘‘పరిపాలన కంటే భాజపా ప్రభుత్వానికి, దాని ముఖ్యనిర్వహణాధికారికి(పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి) ఎన్నికల ప్రచారం ఇష్టమైన కార్యక్రమంగా ఉంది’’ అని సింఘ్వి పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో తమ ప్రాబల్యం కోల్పోతోందని తెలుసుకున్న భాజపా అభద్రతభావంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. "గౌరవనీయులైన ప్రధానమంత్రి కార్యాలయం .. ఒక ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఇలాంటి స్థాయికి దిగజారుతుందా? దీనిపై తీర్పు చెప్పే బాధ్యతను దేశానికి వదిలివేస్తాము" అని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details