తెలంగాణ

telangana

Chandrababu Naidu Arrested by AP CID : చంద్రబాబు అరెస్టు దేనికి సంకేతం..! ఇప్పుడే ఎందుకు..? వివేకా కేసు దృష్టి మళ్లింపా..? పోలీసులకూ.. కళంకమే!

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 4:09 PM IST

Updated : Sep 9, 2023, 7:53 PM IST

Chandrababu Naidu Arrested by AP CID ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు అరెస్టు దేనికి సంకేతమంటూ చర్చలు ప్రారంభయ్యాయి. పాత కేసులో ఇప్పుడే ఎందుకు అరెస్టు చేశారు..? సార్వత్రిక ఎన్నికల వేళ చంద్రబాబు అరెస్టు సీఎం జగన్‌ మైండ్‌ గేమ్‌లో భాగమా..? లేక ప్రజా సమస్యల నుంచి ఓటర్ల దృష్టి మరలించే ఆలోచనా..? వివేకా కేసులో జరగబోయే పరిణామాల దృష్టి మళ్లింపా..? తెలుగుదేశం శ్రేణులను ఆత్మరక్షణలో పడేయాలన్న వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఫలించిందా..?

Chandrababu Naidu Arrest
Chandrababu Naidu Arrested by AP CID చంద్రబాబు అరెస్టు దేనికి సంకేతం..!

Chandrababu Naidu Arrested by AP CID : 2015 జూన్‌ నాటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ.. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని ఏపీసీఐడీ ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనలమైంది. ఏపీసీఐడీ చేస్తున్న అవినీతి ఆరోపణల్లో నిజానిజాలు తేలాల్సి ఉన్నప్పటికీ మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబును అరెస్టు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అధికారం చేపట్టిన నాటి నుంచే అయినవారికి ఆకుల్లో వడ్డిస్తూ... వ్యతిరేకులను జైలుకు పంపడం, వేధించడమనే మూల సిద్ధాంతమే జగన్‌ సర్కార్‌ అజెండా. తనను వ్యతిరేకిస్తే సొంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులను కూడా జగన్‌ పాలనలో జైలుకెళ్లడం ఖాయం. కానీ చంద్రబాబును ఇంత కాలం అరెస్టు చేయకుండా (Chandrababu Naidu Arrested) ఇప్పుడే అరెస్టుకు పూనుకోవడానికి కూడా కీలక కారణాలు కనపడుతున్నాయి.

వివేకా కేసు దృష్టి మళ్లింపా : బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) ముఖ్యమంత్రి బంధువు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డే (MP Avinash Reddy) ప్రధాన నిందితుడని సీబీఐ ఆరోపిస్తోంది. జగన్‌ సోదరి, వివేకా కుమార్తె సునీత సైతం అవినాశ్‌ బెయిల్‌ రద్దు చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేశారు. ఈ కేసుల్లో త్వరలోనే కీలక నిర్ణయం రావొచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. సునీత పిటీషన్‌పై న్యాయస్థానాలు సానుకూలంగా స్పందించి అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు అయితే.. జగన్‌ సర్కార్‌ పరువు పోతుందన్న భావన వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ఉంది. ఈ పరిణామాలను కప్పిపుచ్చుకోవడానికేచంద్రబాబును ఆఘమేఘాల మీద అరెస్టు చేశారన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగుతోంది.

Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్​.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు

వ్యతిరేకతను తప్పించుకోవడానికా..? :సంక్షేమం పేరిట నగదు పంపిణీ తప్పా.. ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్టును జగన్‌ సర్కార్‌ ఈ నాలుగేళ్లలో పూర్తి చేయలేదు. గుంతలు లేని రోడ్లు కాదు.. గుంతల రోడ్లే మా మార్క్‌ పాలన అని వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలే సరదాగా చెప్పుకుంటున్నారు. 24 గంటల కరెంట్‌ కాదు.. 24 గంటలూ విద్యుత్‌ కోతలే అని ఓటర్లు నిష్ఠూరమాడుతున్నారు. పైగా ఇంత కాలం చంద్రబాబు అధికారంలో ఉంటే వర్షాలు రావన్న మూఢ విశ్వాసాన్ని సైతం ప్రజల్లో వైఎస్ఆర్‌సీపీ చొప్పించింది. కానీ ఈ ఏడాది వరుణుడు దోబూచులాడుతున్నాడు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో పోలవరం వంటి ప్రాజెక్టు కట్టి ఉంటే గోదావరి జలాలతో మా పొలాలు పచ్చగా ఉండేవి. పైగా పట్టిసీమ మోటార్లు ప్రారంభించలేదన్న కోపం రైతుల్లో నెలకొంది. ఇలా అన్ని విషయా‌ల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ సంచలనం చేసి వారి ఆలోచనలను మార్చాలన్న లక్ష్యమే అరెస్టుకు కారణమన్న భావన విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu Responded to His Arrest: ఎన్ని కుట్రలు పన్నినా న్యాయమే గెలుస్తుంది.. చంద్రబాబు

ఎన్నో ఆరోపణలు- ఒక్కటీ నిరూపించలేక : చంద్రబాబుపై ఎప్పటి నుంచో జగనే కాదు.. ఆయన తండ్రి వైఎస్‌ కూడా చంద్రబాబుపై అనేక కేసులు వేసి చివరకి కోర్టులో వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాకా డజన్ల కొద్ది కమిటీలు వేసినా చంద్రబాబు దోషిత్వాన్ని నిరూపించలేకపోయాయి. కాలక్రమంలో ఆయన తనయుడు, జగన్‌ కూడా నాలుగున్నరేళ్లుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నాడు. అయినా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయాడు. విపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల ముందు ఎన్నోసార్లు పట్టుబడిపోయాడు. తన ప్రభుత్వ ఆయుష్షు తీరే కాలం రావటంతో ఏదోక నెపంతో చంద్రబాబు అరెస్టుకు పూనుకుందని తెలుగుదేశం వర్గాలు మండిపడుతున్నాయి. రోజు రోజుకూ ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుండటం , అధినేత చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభలు, లోకేశ్ యువగళం పాదయాత్రలకు వస్తున్న ప్రజాదరణ చూసి అధికార పార్టీలో ముసలం మొదలైందనందుకే అరెస్టుకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. వివిధ వర్గాలకు సంక్షేమం రూపేణా కొంత మొత్తం నిధులు ఇస్తున్నా.., పన్నులు, అపవాద రుసుములు, విద్యుత్ ఛార్జీల రూపేణా ఎంతమొత్తం తిరిగి లాక్కుంటోదీ అనేది లెక్కలతో సహా ప్రతీ నియోజకవర్గంలో ప్రజలకు వివరించేలా కరపత్రాలు ముద్రించి పంచుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబుని ఒక్కరోజైనా జైల్లో ఉంచాలనే లక్ష్యంతోనే ఉన్న ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితులు ఇక తనకు అనుకూలంగా లేవని భావించే అక్రమ అరెస్టుకు సీఐడీ రూపేణా పూనుకొన్నాడని తెలుగుదేశం నేతలు (TDP Leaders Concerns Chandrababu Arrest) ధ్వజమెత్తుతున్నారు.

జైలుకు పంపడమే లక్ష్యామా..? : మరోవైపు తాజా అరెస్టుతో చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి నష్టమేమి లేదనీ.., వైసీపీనే ఇరుకున పడిందన్న వాదన కూడా ఉంది. ఇటీవల చంద్రబాబుకు ఐటీ నోటీసులంటూ ప్రచారం జరిగినా.., దానికి స్కిల్ డెవలప్‌మెంట్ (SKILL DEVELOPMENT )అంశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.., ఏదో లింక్ ఉందనే భ్రమను కల్పించే ప్రక్రియలో భాగంగానే తాజా అరెస్టు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబును అరెస్టు చేసేందుకు వచ్చిన ఐపీఎస్‌ అధికారులు (YSRCP Gameplan and Misuse of Police) ఎందుకు అరెస్టు చేయటానికి వచ్చామో కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడిన పరిణామాలు తమకే ఇబ్బందిగా మారాయని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పోలీసులకూ ... కళంకమే : చంద్రబాబు ఏమైనా కరుడుకట్టిన హంతకులా..? పోలీసుల కళ్లుగప్పి దేశాంతరాలకు ఎగిరిపోయే అంతర్జాతీయ నేరస్తుడా? ఫలానా కేసులో మీ వివరణ కావాలని ఇన్నాళ్లు ఎందుకు కోరలేదు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎందుకు వివరణ తీసుకోలేదు? ఏకాఏకిన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి చుట్టుముట్టి ఆయన బస్సు తలుపులు దబాదబా బాదాల్సిన అవసరం ఏంటి? అర్ధరాత్రి పోలీసు బలగాలను వెంటేసుకుని చుట్టుముట్టాల్సిన అవసరం ఏంటి? తెల్లారితే చంద్రబాబు కంటికి కనిపించకుండా సరిహద్దులు దాటిపోతారా..? అన్న ప్రశ్నలు సామాన్యుల మదిని వేధిస్తున్నాయి. ఒక దశలో నిద్రలో ఉన్నవాడిని ఉన్నట్టుగా బస్సుతో సహా తీసుకుని వెళ్లిపోతామని ఖాకీలు చేసిన హెచ్చరికలు పోలీస్ వ్యవస్థకే అవమానం. 14 ఏళ్లు ఈ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి, 74 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ నాయకుడు కనీసం నిద్రలేచే దాకా ఆగలేని అగత్యం ఏం వచ్చిందన్న సందేహం వ్యక్తం అవుతోంది. ఓ సామాన్య పౌరుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అడిగే హక్కు లేదా? చెప్పాల్సిన బాధ్యత రక్షకభటుల మీద లేదా? అలా అడిగిన లాయర్లను మీ దగ్గర సరుకులేదంటూ డీఐజీ రఘురామిరెడ్డి అవహేళనగా మాట్లాడటం యావత్ న్యాయవాద వర్గాన్నే కించపరచటం కాదా? కనీసం పోలీసు దుస్తుల్లో కూడా రాకుండా పెడసరంగా మాట్లాడుతూ మేం చెప్పిందే చట్టం, చేసేదే న్యాయం అనేలా డీఐజీ ప్రవర్తన, కర్కకశత్వం ఖాకీ వృత్తికే కళంకం.

Chandrababu Naidu Arrest : చంద్రబాబుకు అనారోగ్యం.. అయినా ఆగని అరెస్టు.. జగన్‌ సైకో పాలనపై నిరసనలు

ప్రాణ త్యాగానికి సిద్ధమన్న బాబు.. పిచ్చోడు లండన్‌కి మంచోడు జైలుకా..?లోకేష్‌ ఆగ్రహం.. తండ్రిని చూడాలంటే పోలీసుల అనుమతి కావాలా..?

Last Updated :Sep 9, 2023, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details