తెలంగాణ

telangana

బిపిన్ రావత్ చేయాల్సిన ప్రసంగం.. ఏడాది తర్వాత కొత్త CDS నోట..

By

Published : Dec 5, 2022, 7:45 PM IST

Updated : Dec 5, 2022, 8:42 PM IST

భారత ప్రస్తుత సీడీఎస్​ జనరల్ అనిల్ చౌహాన్ సోమవారం వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్(డీఎస్​ఎస్​సీ)కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బిపిన్​ రావత్ రాసుకున్న ప్రసంగాన్ని ఆయన ప్రస్తావించారు.

cds-to-visit-defence-staff-college-for-delivering-gen-rawats-undelivered-talk
cds-to-visit-defence-staff-college-for-delivering-gen-rawats-undelivered-talk

భారతావనికి ఎనలేని సేవలందించి నేలరాలిన తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్​ మరణానంతరం తదుపరి సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టిన జనరల్ అనిల్ చౌహాన్ సోమవారం తమిళనాడులో పర్యటించారు. నీలగిరి జిల్లా వెల్లింగ్టన్​లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాల(డీఎస్​ఎస్​సీ)కు వెళ్లారు. అక్కడ మాతృభూమి సేవకు సన్నద్ధమవుతున్న యువ కిశోరాలకు సందేశాన్నిచ్చారు.

వాస్తవానికి గతేడాది ఇదే సమయానికి వీరిని ఉద్దేశించి జనరల్​ బిపిన్​ రావత్​ ప్రసంగించాల్సి ఉండగా ప్రమాదవశాత్తు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బిపిన్​ రావత్​తో పాటు ఆయన భార్య తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో​ బిపిన్​ రావత్ రాసుకున్న ప్రసంగాన్ని ప్రమాదం జరిగిన చోటు నుంచి సేకరించి భద్రపరిచారు అధికారులు. సోమవారం అదే లేఖను తన ప్రసంగంలో ప్రస్తావించారు అనిల్ చౌహాన్​.

మొత్తం 14 మంది..
8 డిసెంబరు 2021న త్రిదళాధిపతి జనరల్ బిపిన్​ రావత్, ఆయన భార్య మధులిక రావత్​ సహా మొత్తం 14 మంది మిలిటరీ సిబ్బందితో కలిసి తమిళనాడులోని నీలగిరి జిల్లా వెల్లింగ్టన్​లోని సైనిక కళాశాలలో శిక్షణ పొందుతున్న జవాన్​లను ఉద్దేశించి మాట్లాడేందుకు సూలూరు నుంచి బయలుదేరారు. ఘటనకు ఓ కారణమైన దట్టమైన పొగ మంచుతో ప్రమాదవశాత్తు రావత్ ప్రాయాణిస్తున్న హెలికాప్టర్​ నీలిగిరి జిల్లా కున్నూరు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్​ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్ సింగ్​ ఒక్కరే ప్రాణాలతో బయటపడి వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించారు.

దివంగత సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ జ్ఞాపకార్థం ఆయన పేరుతో ఉత్తమ సేవలందించిన అగ్నివీర్ సైనికులకు ట్రోఫీలు ప్రదానం చేయనున్నట్లు భారత నేవీ ప్రకటించింది. అలాగే ఆయన స్మారక ఉపన్యాసాన్ని కూడా డిసెంబర్ 10న నిర్వహిస్తున్నట్లు భారత ఆర్మీ విభాగం తెలిపింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్​ చౌహాన్ డిసెంబర్ 8న దివంగత జనరల్​ బిపిన్​ రావత్​పై పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.

Last Updated : Dec 5, 2022, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details