తెలంగాణ

telangana

ప్రేమించడం లేదని బాలికపై దాడి - ఆపై భయంతో ఆత్మహత్య

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 2:16 PM IST

Boy Suicide Hyderabad Today : తెలిసీ తెలియని వయస్సులో ఇతరుల పట్ల కలిగే ఆకర్షణను ప్రేమగా భావించి ప్రేమిస్తున్నానంటూ కొంత మంది అబ్బాయిలు అమ్మాయిల వెంట పడుతుంటారు. తీరా వాళ్లు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై హత్య చేయడమో లేదా ఆత్మహత్యకు పాల్పడటమో వంటి ఘటనలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్​ అంబర్​పేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

Boy Commits Suicide in Vidyanagar
Boy Commits Suicide who Attacked Girl with a knife

Boy Suicide Hyderabad Today :ప్రేమ నిరాకరించిందని బాలికపై హత్యాయత్నం చేసిన ఓ బాలుడు భయంతో గురువారం అర్ధరాత్రి విద్యానగర్‌- జామియా ఉస్మానియా స్టేషన్ల మధ్య రైలు కింద పడి బలవన్మరణానికి(Suicide) పాల్పడ్డాడు. మృతుడు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలికపై కత్తితో దాడికి పాల్పడిన బాలుడిగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తూర్పు మండలం డీసీపీ సాయిశ్రీ వివరాల ప్రకారం :బాగ్‌అంబర్‌పేట తురాబ్‌నగర్‌లో ఉండే రమణ(16), బాలిక ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుకున్నారు. ఇటీవల బాలిక తల్లి మరణించడంతో ఆమె వాడిన టైలరింగ్ సామాగ్రిని అమ్మకానికి పెట్టారు బాలిక కుటుంబ సభ్యులు. ఆ సామగ్రిని రమణ కుటుంబం కొనుగోలు చేసింది. ఈ క్రమంలో బాలికతో మళ్లీ పరిచయం ఏర్పరుచుకున్న రమణ కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేయడంతో ఆమె తిరస్కరించింది. రమణ అక్కడితో ఆగకుండా తరచూ బాలిక మొబైల్ ఫోన్​కు మెసేజ్​లు పంపుతూ ఉండేవాడు. కనిపించిన ప్రతిసారి అడ్డగించి వేధించసాగాడు. ఈ వేధింపులు తీవ్రతరమైనా బాలిక భరిస్తూనే వచ్చింది కానీ ఎవరికీ చెప్పుకోలేకపోయింది.

మయోనైజ్‌ తిని 17 మందికి అస్వస్థత - రక్తపరీక్షల్లో ఏం తేలిందంటే?

Boy Died After Stabbing Girl Hyderabad :అయితే గురువారం రోజు సాయంత్రం ఆమె తన పెద్దమ్మ కుమార్తె ఇంటికి ట్యూషన్​కు వెళ్తుండగా ఆమె వెంటపడ్డ రమణ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక అతడి నుంచి తప్పించుకుని వెంటనే లోపలికి వెళ్లిపోయింది. రాత్రి 7.30 సమయంలో ట్యూషన్‌లోకి వెళ్లి బాలికను కత్తితో పొడిచాడు. అది గమనించిన ఆమె పెద్దమ్మ కూతురు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెపైనా దాడికి తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అయితే పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం వెతుకుతుండగా రమణ మొబైల్ లొకేషన్ విద్యానగర్ సమీపంలోని రైల్వే పట్టాలు వద్ద కనిపించింది. రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే బాలుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భార్య తల నరికిన భర్త - వివాహేతర సంబంధం అనుమానంతో దారుణం

పచ్చిమాంసం తినొద్దన్నందుకు గొడవ- యువకుడి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details