తెలంగాణ

telangana

యూపీలో భాజపా గెలుపు కష్టమే: ప్రవీణ్ తొగాడియా

By

Published : Mar 2, 2022, 5:52 PM IST

Pravin Togadia on UP BJP: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు వీహెచ్​పీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్​ తొగాడియా. సాగు చట్టాల విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.

Pravin Togadia on UP BJP
యూపీలో భాజపా గెలుపు కష్టమే: ప్రవీణ్ తొగాడియా

Pravin Togadia on UP BJP: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సులువు కాదని విశ్లేషించారు వీహెచ్​పీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా. సాగు చట్టాల ఉపసంహరణలో జాప్యం, రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి ఇందుకు కారణమని ముంబయిలో వివరించారు.

యూపీలో భాజపా గెలుపు కష్టమే: ప్రవీణ్ తొగాడియా

"సాగు చట్టాలను ముందే రద్దు చేసి, 700 మంది రైతులు చనిపోకుండా చూసి ఉంటే ఉత్తర్​ప్రదేశ్​లో విజయం సులువు అయ్యేది. అఫ్గానిస్థాన్​కు మనం రూ.20వేల కోట్లు సాయం చేశాం. కానీ.. చనిపోయిన రైతుల కుటుంబసభ్యులకు రూ.కోటి ఇవ్వలేమా? మనం రైతుల్ని ప్రేమిస్తామా లేక అఫ్గానిస్థాన్​నా? ఇప్పుడు భాజపా అంటే కోపంగా ఉన్న రైతులంతా గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసినవాళ్లే." అని అన్నారు తొగాడియా.

రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం విషయంలో భారత్​ వైఖరిని సమర్థించారు ప్రవీణ్. "దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్​ ఈ నిర్ణయం తీసుకుంది. నా దృష్టిలో ఇది సరైన నిర్ణయం. రష్యా, అమెరికా.. రెండు దేశాలతోనూ వాణిజ్య, రక్షణ సంబంధాలు ఉన్నందున భారత్​ తటస్థంగా ఉండడమే ఉత్తమం" అని అభిప్రాయపడ్డారు. అయితే.. ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చే విషయంలో కేంద్రం జాప్యం చేసిందని విమర్శించారు ప్రవీణ్ తొగాడియా. కేంద్ర మంత్రులు హంగేరీ, రొమేనియా నుంచి బస్సుల్లో వెళ్లి.. విద్యార్థులను తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details