తెలంగాణ

telangana

కుక్కకు బర్త్​ డే గిఫ్ట్​గా 250 గ్రాముల గోల్డ్​ చైన్

By

Published : Dec 31, 2020, 3:04 PM IST

Updated : Dec 31, 2020, 5:32 PM IST

కర్ణాటకలో ఓ పెంపుడు శునకానికి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు యజమానులు. బర్త్​డే గిఫ్ట్​గా ఏకంగా 250 గ్రాముల బంగారాన్నిచ్చి దానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేక్​ కటింగ్​ అనంతరం.. స్థానికులకు అల్పాహారం పెట్టించారు.

Birthday celebration of Dog and gave 250 grams gold as a gift in Karnataka
'శునకం' పుట్టినరోజుకు 250గ్రాముల గోల్డ్​ చైన్​ గిఫ్ట్​

కుక్కకు బర్త్​ డే గిఫ్ట్​గా 250 గ్రాముల గోల్డ్​ చైన్

కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మానవ జీవనంలో సహజం. అయితే.. కర్ణాటకలో ఓ శునకం అదే తరహాలో తన అభిమానుల మధ్య జన్మదినాన్ని జరుపుకుంది. అదీ అచ్చం మనలాగే కేక్​ కట్​ చేసి. ఇదే ఆశ్చర్యం అనుకుంటే... ఏకంగా దానికి 250 గ్రాముల బంగారు గొలుసు గిఫ్ట్​గా ఇచ్చారు ఆ యజమానులు. అంతే కాదండోయ్.. ఊరు ఊరంతా చెప్పుకునేలా.. సుమారు 200 మందికిపైగా అల్పాహారం కూడా పెట్టించారు.

విజయపుర జిల్లాలోని నిడగుండికి చెందిన సంగయ్య.. మూడేళ్ల క్రితం గడగ్​ జిల్లా నుంచి ఓ పెంపుడు కుక్కను తెచ్చకున్నారు. దానికి 'టైగర్​' అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. సంగయ్యకు ముగ్గురు పిల్లలు కాగా.. నాల్గో కుమారుడిగా ఆ కుటుంబంలో ఒకటైంది టైగర్​.

గతంలోనూ..

ఇలా.. ఏటా టైగర్​కు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది సంగయ్య కుటుంబం. అంతకుముందు కూడా ఇదే తరహాలో సుమారు 500 మందిని ఆహ్వానించారట. అప్పుడు 50 గ్రాముల బంగారం గొలుసునూ ఇచ్చానంటున్నారా కుటుంబ సభ్యులు. ఇటీవల దాని పుట్టినరోజు సందర్భంగా.. మరోమారు 250 గ్రాముల పసిడి బహూకరించారు.

ఇదీ చూడండి:కదిలే రైల్లోనే అదిరే 'ఖాదీ' ఫ్యాషన్​ షో

Last Updated : Dec 31, 2020, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details