తెలంగాణ

telangana

Live updates: పార్థివదేహాలకు త్రివిధ దళాల అధినేతల​ నివాళులు

By

Published : Dec 9, 2021, 8:03 PM IST

Updated : Dec 9, 2021, 10:21 PM IST

helicopter crash
దిల్లీకి చేరుకున్న రావత్​​ పార్థివదేహం

21:15 December 09

పార్థివదేహాలకు త్రివిధ దళాల అధినేతల​ నివాళులు

తమిళనాడు కూనూర్​లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన.. సీడీఎస్ జనరల్‌ బిపిన్ రావత్‌ దంపతులు సహా మొత్తం 13 మంది భౌతికకాయాలకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. దిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌లో ఉంచిన పార్ధివదేహాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. సైన్యానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం.. అమరుల కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు.

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం వీరులకు నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో పాటు., ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం.నరవాణె, నావికదళ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌, వైమానిక దళ చీఫ్‌ మార్షల్‌ వీఆర్​ ఛౌదరి నివాళులు అర్పించారు. అటు రక్షణశాఖ కార్యదర్శి, ఆర్మీ, వైమానిక, నావిక దళాలకు చెందిన ఇతర సీనియర్‌ అధికారులు అమరులకు పుష్పాంజలి ఘటించారు.

20:58 December 09

మోదీ నివాళి

తమిళనాడు కూనూర్​లో బుధవారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక రావత్​ సహా 11 మంది సైనికుల పార్థివదేహాలను దిల్లీలోని పాలం ఎయిర్​బేస్​కు తీసుకువచ్చారు. ఎయిర్​బేస్​కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమరుల భౌతికకాయాలకు నివాళులర్పించారు.

20:47 December 09

పార్థివదేహాలకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నివాళులు

తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలకు నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. దిల్లీలోని పాలం ఎయిర్​బేస్​కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల కుటుంబాలతో మాట్లాడి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

20:37 December 09

పార్థివదేహాలకు ఎన్​ఎస్​ఏ అజిత్​ డోభాల్​ నివాళులు

దిల్లీలోని పాలం ఎయిర్​బేస్​కు చేరుకుని సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివదేహాలకు నివాళులర్పించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

20:31 December 09

అమరుల కుటుంబ సభ్యుల నివాళి

హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్​ జనరల్​ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను దిల్లీలోని పాలం ఎయిర్​ బేస్​కు తీసుకొచ్చారు. ఎయిర్​బేస్​కు చేరుకున్న అమరుల కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తమ వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

20:09 December 09

రావత్​ కుటుంబ సభ్యులకు ఉత్తరాఖండ్​ సీఎం పరామర్శ

హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల్ని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి పరామర్శించారు. దిల్లీలోని వారి నివాసానికి వెళ్లి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రావత్ మరణం దేశానికి, మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్‌కు తీరని లోటన్నారు. ఆ నష్టం ఎవరూ పూడ్చలేనిదన్నారు.

19:52 December 09

Live updates: దిల్లీకి చేరుకున్న రావత్​​ పార్థివదేహం

తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో దుర్మరణం పాలైన సీడీఎస్​ జనరల్‌ బిపిన్​ రావత్‌ దంపతులు సహా 13 మంది భౌతికకాయాలు దిల్లీలోని పాలం ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నాయి. సూలూరు ఎయిర్‌ బేస్‌ నుంచి C-130J ఎయిర్‌క్రాప్ట్‌ భౌతికకాయాలతో గురువారం మధ్యాహ్నం బయలుదేరి.. సాయంత్రానికి చేరుకుంది.

రాత్రి 8.30 గంటల నుంచి నివాళి కార్యక్రమం కొనసాగుతుందని సైనికవర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రి అజయ్‌ భట్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌.. పాలం విమానాశ్రయంలో నివాళి అర్పించనున్నారు.

అంతకుముందు.. అమరుల భౌతికకాయాలను మద్రాస్‌ రెజిమెంటల్‌ కేంద్రం నుంచి సూలూరు బేస్‌ క్యాంపునకు తరలించారు. స్థానికులు మానవహారంలా ఏర్పడి అమరుల భౌతికకాయాలను తరలిస్తున్న అంబులెన్స్‌లపై దారి పొడుగున పూలవర్షం కురిపించారు.

Last Updated :Dec 9, 2021, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details