తెలంగాణ

telangana

స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్​ రేప్

By

Published : Mar 5, 2022, 7:54 PM IST

Woman Gangraped: తప్పతాగి స్నేహితుడి ఎదుటే అతడి భార్యను బలవంతం చేశారు ఇద్దరు వ్యక్తులు. వారితో కలిసి భార్యపై అఘాయిత్యాన్ని కొనసాగించాడు ఆ దుర్మార్గపు భర్త. ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి మానవత్వాన్ని మంటగలిపారు. ఈ దారుణం కోల్​కతాలో జరిగింది.

Woman Gangraped
bengal crime news

Woman Gangraped: బంగాల్​లో అమానవీయ ఘటన జరిగింది. భార్యపై భర్తే తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది..

బిహార్​కు చెందిన మహిళ వైద్యం కోసం కోల్​కతా వచ్చారు. ఆమె ఫిర్యాదు ప్రకారం.. ఈ ఘటన తన బంధువు ఇంట్లో గురువారం రాత్రి జరిగింది. ఆ సమయంలో ఆమె భర్తతో కలిసి, అతడి మరో ఇద్దరు స్నేహితులు మద్యం తీసుకుంటున్నారు.

"మత్తులో ఆమె భర్త స్నేహితులు.. అతడి ముందే ఆమెపై బలవంతం చేశారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు" అని పోలీసులు తెలిపారు. మహిళను వైద్య పరీక్షల కోసం పంపారు. అందుకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:నాలుగు నెలలుగా కూతురిపై తండ్రి అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details