తెలంగాణ

telangana

బ్యాంకు దోపిడీకి వచ్చిన ముగ్గురికి చుక్కలు చూపించిన మహిళా పోలీసులు

By

Published : Jan 20, 2023, 1:59 PM IST

Two women police constables foiled a bank robbery attempt as they fought off three armed robbers

బ్యాంక్​ను దోచుకునేందుకు వచ్చిన ముగ్గురు దొంగలను తరిమికొట్టారు ఇద్దరు మహిళా పోలీసులు. బిహార్​లో జరిగిందీ ఘటన.

పట్టపగలే బ్యాంకును దోచుకునేందుకు వచ్చిన ముగ్గురు దొంగల్ని ఇద్దరు మహిళా పోలీసులు సాహసోపేతంగా నిలువరించారు. బిహార్‌ హాజీపుర్‌లో జరిగిందీ ఘటన.
ఇద్దరు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు శాంతి కుమారి, జుహీ కుమారి ఓ బ్యాంకు వద్ద కాపలాగా ఉన్నారు. ఉన్నపాటుగా ముగ్గురు దొంగలు బ్యాంక్​లోకి ప్రవేశించారు. మహిళా పోలీసులపై దాడికి దిగాలనుకున్నారు. దొంగలను చూసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని ధైర్యంగా అడ్డుకున్నారు. మహిళా పోలీసులతో కాసేపు కొట్లాడిన దొంగలు.. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి పారిపోయారు. శాంతి కుమారి, జుహీ కుమారి సాహసాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. బిహార్ పోలీసు శాఖ ఉన్నతాధికారులు వీరికి ప్రశంసా పత్రం ఇచ్చి, అభినందించారు.

"సీనియర్ అధికారులు మా ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మేము చేసిన పనికి అభినందనలు తెలిపారు. మంచి పని చేశామని ప్రశంసించారు."
-శాంతి కుమారి

ముగ్గురు దొంగలతో పోరాడి బ్యాంకు దోపిడీని ఆపిన మహిళా పోలీసులు

తుపాకీతో బెదిరించి.. పెళ్లి నగలు, డబ్బులు చోరీ
ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లోని బన్నాదేవి పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో దోపిడీ జరిగింది. గురువారం ఐదుగురు దుండగులు ఇంట్లో ఉన్న వారిని కొట్టి, తుపాకీతో బెదిరించారు. కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, నగలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన దుండగుల కోసం గాలిస్తున్నారు.

"సాయంత్రం 7:30 గంటల సమయంలో నేను కంప్యూటర్‌పై పని చేస్తున్నాను. ఆ సమయంలో ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. తుపాకీ చూపించి భయపెట్టారు. నన్ను బందీగా పట్టుకుని ఇంట్లో విలువైన వస్తువుల గురించి అడిగారు. అరవకూడదని నోటికి టేపు వేశారు. విలువైన వస్తువులు ఇవ్వకపోతే కాల్చి చంపుతామని బెదిరించారు. విపరీతంగా కొట్టారు. కొద్దిసేపటికి మరో ఇద్దరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. అందరూ కలిసి నా దగ్గర ఉన్న బీరువా తాళాన్ని లాక్కొని కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులు, నగలను దోచుకెళ్లారు. సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు, నగలను దొంగిలించారు.' అని ఇంటి యజమాని సంజయ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details