తెలంగాణ

telangana

హత్య కేసులో పాముకు శవపరీక్షలు.. తేలిందేంటంటే!

By

Published : May 27, 2020, 4:08 PM IST

snake

యూట్యూబ్​ చూసి పాముతో భార్యను హత్య చేసిన కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పాతిపెట్టిన పామును వెలికి తీసి శవపరీక్షలు నిర్వహించారు. పాము కాటుతోనే బాధితురాలు మరణించిందనే విషయం పరీక్షల్లో వెల్లడైనట్లు అధికారులు స్పష్టం చేశారు.

కేరళ కొల్లాంలో పక్కా 'పాము స్కెచ్'​తో భార్యను హత్య చేసిన కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. హత్య కోసం ఉపయోగించిన పామును వెలికితీసి శవపరీక్ష నిర్వహించారు.

పోలీసులు, అటవీ అధికారుల బృందం నిందితుడి నివాసానికి చేరుకొని పాము కళేబరాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించి జాగ్రత్తగా తవ్వి బయటకు తీశారు.

నిందితుడి ఇంటి వద్ద పోలీసులు

పాము కాటు వల్లే..

పాము కాటు వల్లే బాధితురాలు(ఉత్రా) మరణించిందనే విషయం శవపరీక్షల్లో స్పష్టమైందని అధికారులు వెల్లడించారు. దాదాపు 152 సెం.మీ.ల పొడవైన పాము ఇప్పటికే కుళ్లిపోయే స్థితికి చేరుకుందని, అయితే శవపరీక్షకు అవసరమైన నమూనాలు తీసుకోగలిగినట్లు పేర్కొన్నారు. పాము కోరలను సైతం నమూనాల కోసం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఫోరెన్సిక్ అధికారులు

ఫోరెన్సిక్ బృందం సేకరించిన నమూనాలను తదుపరి పరీక్షల కోసం పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. తుది ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు.

హత్య కేసులో ఇంకెవరి పాత్ర అయినా ఉందా? అనే విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

పామును వెలికి తీసిన ప్రదేశం

మరో పెళ్లి కోసం హత్య

రెండో పెళ్లి చేసుకోవాలన్న కోరికతో తన భార్య ఉత్రాను పాముతో కరిపించి హత్య చేశాడు సూరజ్. యూట్యూబ్​లో పాముల ద్వారా ఎలా హత్య చేయాలో తెలుసుకొని పక్కా పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్యకు ఉపయోగించిన పామును ఓ కంటైనర్​లో దాచి ఇంటి పెరట్లో పాతిపెట్టాడు.

ఇదీ చదవండి:పాముతో భార్యను చంపింది.. అందుకోసమే!

ABOUT THE AUTHOR

...view details