తెలంగాణ

telangana

ఠాక్రే ప్రభుత్వాన్ని తొలగించాలన్న పిటిషన్ కొట్టివేత

By

Published : Oct 16, 2020, 5:05 PM IST

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్రపతి పాలన విధించాలన్న పిటిషనర్ వాదనను తప్పుబట్టింది. ఇందుకోసం రాష్ట్రపతిని సంప్రదించాలని సూచించింది ధర్మాసనం.

SC dismisses plea seeking removal of Uddhav govt
ఠాక్రే ప్రభుత్వాన్ని తొలగించాలన్న పిటిషన్ కొట్టివేత

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నేరస్థులను రక్షించేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని దిల్లీ వాసులైన విక్రమ్ గహ్లోత్, రిషభ్ జైన్, గౌతమ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను విచారణకు తిరస్కరించింది ధర్మాసనం. రాష్ట్రపతిని సంప్రదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.

"దేశ పౌరులుగా రాష్ట్రపతిని సంప్రదించేందుకు మీకు స్వేచ్ఛ ఉంది. ఇక్కడ(సుప్రీంకోర్టు)కు రాకండి. బాలీవుడ్ నటుడు మరణించారని చెప్పి.. రాష్ట్రంలో రాజ్యాంగం కొనసాగడం లేదని మీరంటున్నారు. మీరు మాట్లాడుతున్న ప్రతీ సంఘటన ముంబయికి సంబంధించినదే. మహారాష్ట్ర ఎంత పెద్దదో మీకు అవగాహన ఉందా? ఇలాంటివి మేం అంగీకరించం."

-విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

పౌరుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను నిజాయతీగా నిర్వహించడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. ప్రభుత్వ వ్యవహారాలు న్యాయబద్ధంగా జరగడం లేదని పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మరణం, కంగనా రనౌత్​కు బెదిరింపులు, ఆమె కార్యాలయ కూల్చివేత, మాజీ నేవీ అధికారిపై దాడి వంటి అంశాలను పిటిషనర్లు ప్రస్తావించారు. పూర్తిస్థాయిలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన సాధ్యం కాకపోతే... ముంబయి, పరిసర జిల్లాల్లోనైనా విధించాలని కోరారు.

ఇదీ చదవండి-కాంగ్రెస్​ నేత గులాం నబీ ఆజాద్​కు కరోనా

ABOUT THE AUTHOR

...view details