తెలంగాణ

telangana

కరోనా ఉన్న గర్భిణికి సిజేరియన్- తల్లి, బిడ్డ క్షేమం

By

Published : Apr 11, 2020, 9:20 PM IST

Updated : Apr 12, 2020, 1:03 AM IST

కేరళ వైద్యులు అద్భుతం చేశారు. కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణికి సిజేరియన్​ ద్వారా ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. నవజాత శిశువు శాంపిళ్లను కరోనా పరీక్షలకు పంపించారు.

Pregnant COVID-19 woman
కరోనా గర్బీనికి సిజేరియన్

కరోనాతో పోరాడుతున్న గర్భిణికి సిజేరియన్​ ద్వారా విజయవంతంగా ప్రసవం చేసి కేరళ వైద్యులు చరిత్ర సృష్టించారు.

కాసర్​గోడ్​కు చెందిన ఓ మహిళ కరోనాతో పోరాడుతూ కన్నూర్​లోని ప్రియరామ్ మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె ప్రసవ సమయం దగ్గర పడటం కారణంగా వైద్యులు వ్యక్తిగత రక్షణ పరికరాలు​ (పీపీఈ)లు ధరించి.. సిజేరియన్​ ద్వారా పసికందును బయటకు తీశారు. నవజాత శిశువు శాంపిళ్లను కొవిడ్ నిర్ధరణ పరీక్షకు పంపించారు.

ఇద్దరూ క్షేమమే..

ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇద్దరి ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. కొన్ని రోజుల పాటు బిడ్డను తల్లి నుంచి వేరుగా ఉంచనున్నట్లు పేర్కొన్నాయి. ఆ తర్వాత తల్లిపాలు ఇచ్చేందుకు అనమతించనున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.

కరోనాతో పోరాడుతూ భారత్​లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు ప్రసవించారు. కేరళలో మాత్రం ఈమే తొలి వ్యక్తి.

Last Updated :Apr 12, 2020, 1:03 AM IST

ABOUT THE AUTHOR

...view details