తెలంగాణ

telangana

నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు!

By

Published : Mar 23, 2020, 5:14 AM IST

Updated : Mar 23, 2020, 6:16 AM IST

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిసే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 12 రోజుల ముందుగానే ఉభయ సభలను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

parliament-budget-session
నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు!

నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు!

కరోనా వైరస్ సెగ భారత పార్లమెంట్​కు పాకింది. ప్రస్తుత బడ్జెట్​ సమావేశాలు నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. రెండు సభల్లో ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన అనంతరం సమావేశాలకు ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. అయితే దేశంలో కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా 12 రోజుల ముందుగానే వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

తృణమూల్ కాంగ్రెస్, ఎన్​సీపీ సహా చాలా వరకు రాజకీయ పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పూర్తి నిర్బంధం విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉభయ సభలు వాయిదా పడటం లాంఛనమే కానుంది.

ఇదీ చూడండి: 'జనతా కర్ఫ్యూ ఆరంభం మాత్రమే.. పోరాటానికి సిద్ధమవ్వాలి'

Last Updated : Mar 23, 2020, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details